పట్టువదలని విక్రమార్కుడు స్మశానంలో చెట్టుపైనున్న బేతాళుని బంధించి భుజంపైన చెర్చుకుని మౌనంగా నడవసాగాడు.
శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుడు " మహరాజా నీపట్టుదల మెచ్చదగినదే ! సకల వేదాలను,పురాణాలను చదివిన నీవు ,నాకు చాలాకాలంగా ఉన్న సందేహన్ని తీర్చాలి . సుమాలి అతని బంధువర్గం గురించి తెలుసుకోవాలని ఉంది తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు "అన్నాడు.
" బేతాళా సుమాలి మాల్యవంతుని తమ్ముడు.రావణుని మాతామహుడు.సుకేసుని కుమారుడు.సుమాలి భార్య కేతుమతి, అతనికి పది మంది కుమారులు - ప్రహస్త్ర, అకంపన, వికట, కలికాముక, దుమ్రాక్ష, దండ, సుపార్శ్వ, సంహది, బర్కర్ణ మరియు నలుగురు కుమార్తెలు - రాక, పుష్పత్యత, కైకసి, మరియు కుంభినాసి. థాక అనే యక్ష యువరాణి అతని భార్యగా కూడా పేరు పొందింది. ఆమె సుమాలికి సుబాహు మరియు మారీచ అనే ఇద్దరు కుమారులు మరియు కైకేసి అనే కుమార్తెను కన్నది . కైకేసి విశ్రవ ఋషిని వివాహం చేసుకుంది మరియు వారి కుమారుడు రావణుడు లంకను తిరిగి జయించాడు. కైకేసి యొక్క ఇతర కుమారులు- కుంభకర్ణుడు మరియు విభీషణుడు . ఆమెకు శూర్పణఖ అనే కుమార్తె ఉంది . సుమాలి భార్య కేతుమతి, అతనికి పది మంది కుమారులు - ప్రహస్త్ర, అకంపన, వికట, కలికాముక, దుమ్రాక్ష, దండ, సుపార్శ్వ, సంహది, బర్కర్ణ మరియు నలుగురు కుమార్తెలు - రాక, పుష్పత్యత, కైకసి, మరియు కుంభినాసి. థాక అనే యక్ష యువరాణి అతని భార్యగా కూడా పేరు పొందింది. ఆమె సుమాలికి సుబాహు మరియు మారీచ అనే ఇద్దరు కుమారులు మరియు కైకేసి అనే కుమార్తెను కన్నది . కైకేసి విశ్రవ ఋషిని వివాహం చేసుకుంది మరియు వారి కుమారుడు రావణుడు లంకను తిరిగి జయించాడు. కైకేసి యొక్క ఇతర కుమారులు- కుంభకర్ణుడు మరియు విభీషణుడు . ఆమెకు శూర్పణఖ అనే కుమార్తె ఉంది .
ఈమె తండ్రి రామాయణంలో వివరించిన విధంగా విశ్రావుడు.ఇతను ఒక రుషి. అగస్త్య ముని సోదరుడు, సృష్టికర్త బ్రహ్మ మనవడు, శక్తివంతమైన రుషి కుమారుడు.పండితుడు, అతను తపస్సు ద్వారా గొప్ప శక్తులను సంపాదిస్తాడు.అది అతనికి గొప్ప పేరును సంపాదించింది.ఇతని భార్య కైకాసి అనే అసుర మహిళ. విశ్రావుడు, కైకసి దంపతులకు రావణుడు, శూర్పణఖ కాక వీరికి విభీషణ, కుంభకర్ణ అనే మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు.విశ్రావుని మరొక భార్యకు జన్మించిన కుబేరుడు శూర్పణఖ అర్ధ సోదరుడు.
విశ్రావుడు, అతని రెండవ భార్యకు జన్మించిన శూర్పణఖ పుట్టినప్పుడు " మీనాక్షి " (చేప కన్నులుగలదని అర్థం) అనే పేరు పెట్టారు.అమె దుష్టబుద్ధిగల రాక్షసుడుని వివాహమాడింది.మొదట్లో శూర్పణఖ భర్త, తన సోదరుడు, లంకరాజైన రావణుడితో అధిక అభిమానాన్ని సంపాదించాడు.అతను ఆ కారణంతో రావణుడి ఆస్థానంలో విశేషమైన సభ్యుడుగా వ్యవహరించాడు. అయితే దుష్టబుద్ధి కలిగిన అసురుడు మరింత అధికారం కోసం కుట్రపన్నాడు.ఆసంగతి రావణుడు తెలుసుకుని దుష్టబుద్ధిని చంపాడు.అన్న తన భర్తను చంపినందుకు శూర్పణఖ చాలా అసంతృప్తి చెందింది.వితంతువు శూర్పణఖ లంక, దక్షిణ భారతదేశంలోని అరణ్యాల మధ్య గడిపింది.అలా అరణ్యాల మధ్య తిరుగుతూ అసుర, అటవీ నివాస బంధువులను సందర్శిస్తూ కాలం గడుపుతుంది.వాల్మీకి రామాయణం ఆధారంగా అటువంటి ఒక సందర్శనలో, ఆమె పంచవటి అడవిలో రాముడిని చూస్తుంది, చూసిన వెంటనే వితంతువుగా ఉన్న ఆమె మనస్సులో రాముడిపై ప్రేమలో కలిగింది.ఆమె రాముడిని కావాలని కోరుకుంటుంది.ఆమెకు ఉన్న మాయ అనే శక్తిని ఉపయోగించుకునే అందమైన మహిళగా తనను తాను ముసుగు చేసుకుంటుంది. ఆమె రాముడు దగ్గరకు వచ్చి అతని పాదాలను తాకి నమస్కరించింది. రాముడు ఆమెను ఎవరు నీవు అని మూలం గురించి ఆరా తీస్తాడు. ఆమె బ్రహ్మ మనవడి కుమార్తె అని, కుబేరుడు ఆమె సోదరుడని, శూర్పణఖ చెప్పింది. ఆ తరువాత ఆమె రాముడు సౌందర్యాన్ని గురించి పొగిడి, ఆమెను వివాహం చేసుకోమని కోరింది.దానికి రాముడు తాను ఇప్పటికే వివాహం చేసుకున్నానని, తాను " ఏకపత్నీవ్రతుడు " నని అంటే ‘ఒక భార్యకు మాత్రమే విధేయుడును’ అని రాముడు చెప్తాడు.
శూర్పణఖను తన సోదరుడు లక్ష్మణుడుని సంప్రదించమని చెపుతాడు. రాముడు ఏకపత్నీవ్రతుడైనందున ఇది జరిగేది కాదని ఉద్దేశంతో, లక్ష్మణుడు తన ఆనందంకోసం, ఆమెను ఆటపట్టించాలని తాను రాముడు సేవకుడునని చెప్తాడు.అందువల్ల, ఆమె తన భార్యకు బదులుగా ఉండేకంటే, రాముడు రెండవ భార్యగా ఉండటం మంచిదని సలహా ఇస్తాడు.ఆ మాటలకు శూర్పణఖ కోపంగా మారి సీత గురించి అసభ్యంగా మాట్లాడింది.సీత రక్షణకు వచ్చిన లక్ష్మణుడు కోపంతో శూర్పణఖ ముక్కు, చెవులు కత్తిరిస్తాడు. లక్షణుడు చేత పరాభవం చెందిన శూర్పణఖ ప్రతీకారం తీర్చుకోవటానికి మొదట తన సోదరుడు వద్దకు వెళ్లి, రాముడిపై రక్షా యోధులుపంపి దాడిచేసింది.వీరంతా చంపబడ్తారు.ఆమె నేరుగా అన్న రావణుడి ఆస్థానానికి వెళ్లి, జరిగిన సంఘటన గురించి శూర్పణఖ తన సోదరుడు రావణడుకి ఫిర్యాదు చేసింది. ప్రతీకారం తీర్చుకోవడంలో రావణుడి సహకారాన్ని పొందటానికి సీత, అందాన్ని గురించి కీర్తించడం ద్వారా, సీతను రావణుడికి తగిన భార్యగా ప్రశంసించడం, బలవంతంగా ఆమెను అపహరించి వివాహం చేసుకోవాలని అతన్ని ప్రేరేపించి, రావణుడుకు ఆసక్తిని రేకెత్తిస్తుంది. అతను సీతను కలిగి ఉండాలని నిర్ణయించుకుంటాడు. అతను సీతను అపహరించాలని నిర్ణయించుకుంటాడు. రావణుడు తన సోదరుడు విభీషణ వారించిననూ సీతను మోసంతో అపహరించి రాముడుతో యుద్ధానికి కారణమవుతాడుదీని ప్రకారం, ఆమె రావణుడుని ప్రేరేపించి రావణుడిచే సీతను అహరించేలా చేయించి, ఫలితంగా రావణుడు, రాముడుల మధ్య జరిగిన యుద్ధం, ఆమె సోదరుడిని చంపాలనే ఏకైక లక్ష్యంతో ఆమె ప్రణాళికలు వేసినట్లుగా ఉందని పురాణాల ద్వారా తెలుస్తుంది." అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగం కావడంతో శవంతో సహ మాయమై స్మశానంలోని చెట్టుపైకి చేరాడు బేతాళుడు.
పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళునికై వెనుతిరిగాడు.
సుమాలి .పురాణ బేతాళ కథ.:- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి