రామయ్య నిరుపేద. రెక్కాడితే కానీ డొక్కాడదు. అడవి
లో కట్టెలు కొట్టుకొని, అమ్మి, జీవనం సాగిస్తున్నాడు. ఒకరోజు అడవిలో చెట్టును కొట్టబోగా వనదేవత ప్రత్యక్షం అయ్యింది. "చెట్లను నరుక్కుంటూ పోతే భవిష్యత్తులో కరవు కాటకాలు విజృంభించి మనం ఎవరమూ ఉండము. కాబట్టి ఈ పనులు ఆపు." అన్నది. అప్పుడు రామయ్య "మరి మాకు జీవనాధారం ఏది?" అన్నాడు. "నువ్వు 3 కోరికలు కోరుకో. అవి తీరుస్తా." అన్నది దేవత. "నాకు ఏ కోరికలూ లేవు. నా కుటుంబానికి ఏమీ చేయలేక పోతున్నాను అనే బెంగ ఉంది." "సరే ఆలోచిస్తాలే. ఇప్పుడు నీ ఇంటికి వెళ్ళు." అన్నది వనదేవత. ఇంటికి వెళ్ళి చూసుకునే సరికి అంతా మారిపోయింది. ఖరీదైన భవనం, ఐశ్వర్యం లెక్కలేనంత. రామయ్య ఆశ్చర్యపోయాడు. అవసరానికి తగినంత డబ్బు వాడుకొని, మిగతా డబ్బుతో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ఇంట్లో అంతా నిశ్చయించుకున్నారు.
పొరుగునే ఉన్న సోమయ్య ఈ వింత చూసి ఆశ్చర్యపోయాడు. కారణం తెలుసుకు రమ్మని సోమయ్య భార్య కాంతమ్మ సోమయ్యను రామయ్య ఇంటికి పంపింది. జరిగింది తెలుసుకున్నాక సోమయ్యనూ అడవికి పంపింది. చెట్టును కొట్టబొగా వనదేవత ప్రత్యక్షం అయింది. మళ్ళీ రామయ్యతో మాట్లాడిన మాటలే మాట్లాడింది. తన జీవనాధారం ఇదే అన్నాడు సోమయ్య. వనదేవత కోరికలు కోరుకొమ్మని అన్నది. తన ఊరిలోనే అందరి కన్నా ఖరీదైన భవనాలు, అంతు లేని సంపద ఇమ్మన్నాడు. సరే అన్నది దేవత. కానీ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలి అనే షరతు విధించింది. సరే అన్నాడు సోమయ్య.
ఇంటికి వచ్చాక చూసుకుంటే రామయ్య కంటే ఖరీదైన భవనం, సంపద కనిపించాయి. భార్యకు జరిగింది అంతా చెప్పాడు. భార్య చూద్దాంలే అన్నది. విలాసాలు శ్రుతి మించాయి. ఒక్క రూపాయి కూడా దానం చేసిన పాపాన పోలేదు. ఇరుగు పొరుగు, బంధువులతో సంబంధాలు తెగిపోయాయి. రక్త సంబంధీకులు, స్నేహితులతో సైతం చాలా పొగరుగా ప్రవర్తిస్తున్నారు. వారితో సంబంధాలు తెంచుకున్నారు.
ఒకరోజు సోమయ్య బాల్య మిత్రుడు బాలయ్య సోమయ్య ఇంటికి వచ్చాడు. అతడిని బయటే నిలబెట్టి మాట్లాడాడు సోమయ్య. చిన్నప్పుడు బాలయ్య, సోమయ్య ప్రాణ స్నేహితులు. సోమయ్యకు విద్యలో ఎంతో సహాయం చేసాడు బాలయ్య. అటువంటి బాలయ్య తాను చాలా పేదరికంతో కష్టాల్లో ఉన్నాను ఆదుకొమ్మని సహాయం అడిగాడు. సోమయ్య బాలయ్య ముఖం మీదే తలుపు వేసుకున్నాడు.
ఆ రాత్రి గడిచింది. వేకువ జామునే లేచి చూసుకోగా తమ కుటుంబం అంతా పూరి గుడిసెలో ఉంది. ఇంట్లో రూపాయ కూడా లేదు. మాసి పోయిన బట్టలే మిగిలాయి. లబోదిబోమన్నారు అంతా. ఈ సంగతి తెలిసిన వారంతా తగిన శాస్తి అయింది అని అన్నారు. సోమయ్య ముఖం చూసే వారే లేరు. పట్టించుకునే వారు శూన్యం. కష్టపడి పని చేద్దాం అన్నా పని ఇచ్చేవారు లేరు. ఆ ఊరు విడిచి చాలా దూర ప్రాంతాలకు వెళ్ళారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి