సుడిగాలి
వాడల్ని గుడి వీధుల్ని
మేడల ఎత్తుల్ని
గోడల లోతుల్ని చుట్టేసినట్లు
గాలి
ఆకాశాన్ని భూమిని ఆక్రమించినట్లు
సముద్రాన్ని
నిద్రలేపినట్లు
మేఘాల్ని మెరుపుల్ని ఢీ కొట్టి
ఉరుములు ఉరిమినట్లు
అడవినంతా
మెడలు వంచి
కౄరమృగాల గాండ్రింపులు
గాల్లో కలిసిపోయేట్లు చేసిన
గాలి అతను చిరుగాలి అతను
పైరగాలి అతను
కోకిల కు మావిచిగురు అతను
చిలుకకు పలుకు అతను
జలపాతానికి చిరునవ్వు అతను
నదికి హృదయం అతను
కడలికి ఒడి అతను
గీతానికి బడి అతను
సంగీతానికి జత అతను!!
ఏ ఆర్ రెహమాన్!!
================================
దిగ్గజ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ త్వరగా కోలుకోవాలని.
డా ప్రతాప్ కౌటిళ్యా 👏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి