పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు::- సి.హెచ్.ప్రతాప్
 రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజారోగ్యం మరియు గాయాల నివారణ సమస్యలలో ఒకటిగా మారాయి. బాధితులు ప్రమాదాలకు ముందు చాలా ఆరోగ్యంగా ఉండటం వల్ల ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రతి సంవత్సరం ప్రపంచ రోడ్లపై 1 మిలియన్ కంటే ఎక్కువ మంది మరణిస్తున్నారు. 2004లో వ్హో ప్రచురించిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రోడ్లపై జరిగే ట్రాఫిక్ ప్రమాదాలలో ప్రతి సంవత్సరం 1.2 మిలియన్ల మంది మరణించారని మరియు 50 మిలియన్ల మంది గాయపడ్డారని అంచనా వేయబడింది మరియు 10–19 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో మరణానికి ట్రాఫిక్ ప్రమాదాలు ప్రధాన కారణమని కూడా నివేదిక పేర్కొంది
ఈ మధ్య కాలంలో యువత బైక్‌ లపై మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ అనేక ప్రమాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తుండటం అత్యంత ఆందోళనకరమైన విషయం.అతివేగం అనర్థదాయకం వంటి బోర్డులను రాష్ట్ర రవాణా శాఖ వారు ఎన్ని పెట్టినా వాటిని పెడచెవిన పెడుతూ యువత అత్యంత వాయు వేగంతో తమ మోటార్‌ బైక్‌లను నడుపుతూ పలు ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీనితోపాటు వేగ నిబంధనలను అతిక్రమించదం,సెల్ ఫోన్ డ్రైవింగ్, ముగ్గురు, నలుగురు ప్రయాణించడం వంటివి సర్వ సాధారణ మైపోయాయి.  ఇటువంటి విన్యాసాల వలన అటు వారి ప్రాణాలను ప్రమాదపు అంచుల్లోకి తీసుకుపోవడమే గాక ఇటు రోడ్డు మీద నడిచే పాదచారులను, వాహనాలపై ప్రయాణించే ఇతర వాహనదారుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టి వేస్తుండటం శోచనీయం.రోడ్డు ప్రమాదాల్లో ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పిల్లలకు ట్రాఫిక్ నిబంధనల గురించి చిన్నప్పటి నుంచే నేర్పించాలి. జీవితం యొక్క విలువను మరియు దానిని ఎలా కాపాడుకోవాలో వారికి నేర్పించాలి.
అంతేగాక, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తుల కోసం ప్రభుత్వం మరింత కఠినమైన చట్టాలను ఆమోదించాలి. లింగంతో సంబంధం లేకుండా ఈ చట్టాలను ఉల్లంఘించినట్లు తేలినప్పుడు వారు వ్యక్తులకు భారీగా జరిమానా విధించాలి లేదా కఠిన చర్యలు తీసుకోవాలి.డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్‌లను ఉపయోగించకుండా తల్లిదండ్రులు చిన్నవారికి ఆదర్శంగా ఉండాలి. అలాగే ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు హెల్మెట్‌లు, సీటు బెల్టులు తప్పనిసరిగా ధరించాలి.

కామెంట్‌లు