అంతర్జాతీయ కవితా దినోత్సవం( 21/03/25) పురస్కరించుకొని ఈరోజు ఉన్నత విద్య కమిషనరేట్లో సంతకము కవితా సంకలన రచయిత ప్రముఖ కవి సాహితీవేత్త డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యాను మెమెంటో మరియు శాలువా ప్రశంసాపత్రంతో ఘనంగా సన్మానించిన తెలంగాణ రాష్ట్ర మల్టీ జోనల్ ఉన్నత విద్య జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేందర్ సింగ్ గారు.
సాహిత్యం , విద్యా విభాగంలో విశిష్ట కృషి చేసినందుకు ఈ సోమవారం డాక్టర్ ప్రతాప్ కౌటిల్య సిద్ధి లింగేశ్వర స్ఫూర్తి ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. అంతకు పూర్వం బి ఎస్ రాములు స్ఫూర్తి పురస్కారాన్ని రవీంద్రభారతిలో అందుకున్నారు. ఈ సంవత్సరానికి గాను సాహిత్యం మరియు విద్యా విభాగంలో కృషి చేసినందుకు గాను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ పురస్కారాన్ని విశాఖపట్నంలో డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా అందుకున్నారు.
డాక్టర్ ప్రతాప్ కౌటిల్య విశ్రాంత అధ్యాపకుడు. ప్రస్తుతం పాలెం డిగ్రీ కళాశాల సి పి డి సి మెంబర్గా కొనసాగుతున్నారు. జిల్లా కలెక్టర్చే పలు సార్లు ప్రశంసా పత్రాలు సన్మానాలు పొందారు. వివిధ రాష్ట్ర జిల్లా స్థాయి కవి సమ్మేళనాలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. ఇంతవరకు మూడు వేలకు పైగా కవితలు రాశారు. వాటిలో చాలా కవితలు పలు స్థానిక పత్రికలలో ప్రచురించబడ్డాయి. డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా ఇప్పటివరకు నాలుగు పుస్తకాలను ప్రచురించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో ఘనంగా సన్మానించబడి పురస్కారంతోపాటు పారితోషికాన్ని కూడా పొందారు. డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా కవితా సంకలనాన్నీ ప్రవాస భారతీయుల లయోలా సంస్థ ప్రచురించి బహుమతిని ప్రకటించింది.
ఈ సందర్భంగా ప్రతాప్ కౌటళ్యాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినిలు శ్రీమతి సునీత ప్రతాప్ మరియు శ్రీమతి శశికళ పాల్గొన్నారు.
ప్రొఫెసర్ రాజేందర్ సింగ్ ఎమ్మెస్సీ పీహెచ్ డి
డిలీట్.
మల్టీ జోనల్ జాయింట్ డైరెక్టర్
ఉన్నత విద్యా కమిషనరేట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి