న్యాయములు-816
"అనాశ్వాసిత దుఃఖితే మనసి సర్వ మసహ్యమ్ " న్యాయము
*****
అనా అనగా అంటే,అన్న తర్వాత. శ్వాసిత అనగా శ్వాసించిన లేదా ఊపిరి పీల్చిన.దుఃఖిత అనగా దుఃఖము కలవాడు,బాధితుడు.మనసి అనగా మనసు లేదా చిత్తము.సర్వ అనగా అన్ని లేదా మొత్తము.మసహ్యమ్ అనగా సహ్యము కానిది,మనసుకు సహించనిది,రోతకలిగించునది,ఏదైనా అసహ్యకరమైన లేదా మనసుకు నచ్చని విషయం లేదా వ్యక్తి పట్ల కలిగే విరక్తి,అసహనం,వ్యతిరేక భావన అనే అర్థాలు ఉన్నాయి.
మితిమీరిన దుఃఖంతో బాధపడే వారి మనసును ఓదార్చే వారు లేకపోతే ప్రపంచమంతా తనకు సహించనిదిగా,ఈ వ్యక్తుల పట్ల అసహనం, విరక్తితో పాటు ఒకలాంటి వ్యతిరేక భావన పెరుగుతుంది.
అనగా ఓదార్చే వారు లేకపోతే మితిమీరి దుఃఖించు మనసుకు అంతయూ అసహ్యముగా,ఈ ప్రపంచమే వ్యర్ధంగా తోచును అని అర్థము.
అలవిగాని వేదనల నిరాశా నిస్పృహల చీకట్లో ఒంటరిగా విలపించే వ్యక్తిలో చిరుదీపపు బతుకాశను వెలిగించే వారుంటే కొండంత దుఃఖం దూది పింజై ఎగిరిపోతుంది.
దీనికి ఉదాహరణగా రామాయణంలో సీతమ్మ వారి గురించి చెప్పుకోవాలి. రావణాసురుడు పెట్టిన గడువు పూర్తి అవుతుంది. దీనికీ తోడు కాపలా కాస్తూ ఉన్న రాక్షస స్త్రీల బెదిరింపు.ఎట్లాగూ తనకు మరణం తప్పదు కాబట్టి తానే ప్రాణం తీసుకుందామని జడతో ఉరివేసుకోబోయే సమయంలో సీతమ్మ జాడ కోసం వచ్చిన హనుమంతుని రామ కథా గానము,. విభీషణుడి కుమార్తె త్రిజట రాక్షస స్త్రీలను హెచ్చరించి సీతమ్మ తల్లిని వారించి ఆమెకు ఇచ్చిన ఓదార్పు జీవితాశను కలిగిస్తుంది.
అలాంటి ఆత్మీయ మాటల హృదయ స్పర్శ సోకని వారు మండుటెండలకు ఎండిపోయిన బావులవుతారు.
ఒకానొక దశలో వారిలో కలిగే విరక్తి ప్రపంచాన్ని వీడిపోవాలనే అభద్రతా భావాన్ని పెంచుతుంది. అందుకే బాధాతప్త హృదయాలను ఓదార్చే మనసుండాలి. మనసు నిండా మానవత్వం తొణికిసలాడాలి. అమ్మలా అక్కున చేర్చుకుని నాన్నంత భరోసా ఇవ్వాలి.
అప్పుడే ఈ ప్రపంచం నాది కాదని దూరం జరగబోయే వ్యధాభరిత జీవులకు దేవదాసు సినిమాలోలా ఓ కవి రాసినట్లు "అంతా భ్రాంతియేనా జీవితాన సుఖమింతేనా? ఆశ నిరాశేనా? మిగిలింది వంతేనా? అని వగచే వారికి ఈ సమాజంలోని వ్యక్తులుగా మనం మనుషులపై నమ్మకం కలిగించాలి . అప్పుడే వారు జనజీవన స్రవంతిలో కలిసిపోయి బతకగలరు.
దుఃఖాలు, కష్టొలు అందరివీ ఒకేలా ఉండకపోవచ్చు కానీ బాధతో తల్లడిల్లినపుడు కళ్ళల్లోంచి ఉబికే అశ్రువులు మాత్రం ఒకే రకంగా,ఉప్పగానే ఉంటాయి.
"బాధలు వచ్చాయి బతకడం ఎందుకు? అనుకుంటే ఈ లోకంలో ఇంత జనాభా వుండేది కాదు. ఎవరూ ఓదార్చే వారు లేకపోతే బతుకు శూన్యంగా మారుతుంది.
కాబట్టి "అనాశ్వాసిత దుంఖితే మనసి సర్వ మసహ్యమ్" న్యాయమును ఆమూలాగ్రం, కూలంకషంగా చదివాం కదా!మరి దానిని దూరం చేసేందుకు మన వంతు ప్రయత్నం చేద్దాం. అప్పుడే మనం మానవతా వృక్షాలమై చల్లని మాటల నీడలతో సేద తీర్చిన వారమవుతాం.జీవితంపై విరక్తి చెంది అర్థాంతరంగా తనువు చాలించాలనుకునే వారి ఆలోచనలను మళ్ళించి వారికో కొత్త జీవితాన్ని ప్రసాదించిన వారం అవుతాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి