నీ తప్పు నీవు తెలుసుకో ! :- కోరాడ నరసింహా రావు.
విజ్ఞానాన్ని పెంచు కోటాని కైతే ఎంతైనా చూడు...! 
  పిచ్చెత్తించే చెత్తను అలా చూడకుమీ... 
 నీ బుర్రంతా చెత్తతో నిండి నీ బ్రతుకుకు నువ్వోపెద్ద చెత్త కుండీవై పోతావ్...!! 

విజ్ఞా న మెప్పుడూ రెండు వైపులా పదును కలిగిన కత్తె తమ్ముడు... 
 నీ ఉపకారానికి వినియోగించు...! 
  అపకారానికి వాడుకుంటే
 తరువాత నిన్ను చూసి జాలిపడే వారెవరూఉండరు... 
 బాధపడే నీతల్లి,దండ్రులు తప్ప...! 
  నువ్వు చేస్తున్నది తప్పు అని నీకు తెలుసు... 
  అందుకే... ఎవరికీ తెలియ కూడదని , రహస్యముగా చూసు కుం టున్నావ్...! 
  తెలిసి చేసిన తప్పుకు క్ష మించటాలు ఉండవు మిత్రమా...! 
  ఇకనైన నీ తప్పు నీవు తెలుసుకో... 
  సన్మార్గంలో నడుచుకో...! 
       *******

కామెంట్‌లు