అహం హానికరం:- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు
హానికరమే అహము
ముమ్మాటికీ నిజము
శిశిర ఋతువు మాదిరి
పోగొట్టును సర్వము

అహంతో అనర్ధము
చెరుపునోయ్! జీవితము
వదిలివేస్తే మేలు
వినయశీలత ముఖ్యము

అహమే చీడ పురుగు
అది శత్రువుని ఎరుగు
నిలువెల్లా తొలచును 
ఆరోగ్యం చెరుపును

అగ్గిరవ్వ లాంటిది
అణువణువును కాల్చును
ఆదిలో త్రించితే
సకలము చక్కబడును

అహం లేని మనుషులు
మహిలో మహా ఘనులు
వారు శాంతి దూతలు
చూడ మహా దాతలు


కామెంట్‌లు