ఏ భాషఒకే లతకు పూచిన కుసుమం కాదు.:-డా సి వసుంధర చెన్నై

 నీన్నటి హింది భాషా కవితకు పొడిగింపు
==========================
మధ్య యుగానికి చెందిన ప్రాకృత, మరియు ఇండో ఆర్యన్  భాషలు,ఇంకా సంస్కృతం కలిసి
పుట్టిన భాష, హిందీ భాష.🍇  
హిందీ లిపిని మరియు కావలసిన కొన్ని పదాలు సంస్కృతంనుండి
తీసుకోబడ్డాయి/హిందీ, ఉర్దూ భాషలకులిపులు వేరు వేరుగా వున్నాయి/హిందీ లిపి, దేవనాగరిక లిపిఉర్దూ లిపి, పర్షియన్ లిపి/
ఉత్తర భారతంలోముస్లిముల ప్రభావం వల్ల పర్షియన్, అరబిక్,టర్కిష్  పదాలు హిందీలో చేరిఉర్దూ అనే కొత్త భాష
పుట్టినదని తెలుస్తున్నది/ప్రామాణిక హిందీభాషాT. V లలో వార్తలలో ఉంది.
 మనం చాలమందిమి అనుకున్నట్లు హిందీ
మన జాతియ భాషకాదు. అనేక భాషలున్నదేశం.  మన దేశంలో ఏ భాషకు దేశ భాష అన్నహోదా ఇవ్వకుండా మన నేతలు నిస్వార్థ బుద్దిని,సమానత్వాన్ని చాటుకున్నారు. కేంద్రంలో మాత్రం అధికార భాషగా హిందీ ఉంది.ఉత్తర భారతంలో తనాభావుటా ఎగుర వేసిన హిందీ, గాంధీ చేపట్టిన స్వాతంత్ర సమర సన్నాహంలో దక్షిణానికి కూడా తన
పవనాలను విస్తరించి
ఒక్క ఊపు ఊపింది.ఆ ఊపులో
ఆంధ్రలో హిందీ టీచర్లు
 భారీగానే ఏర్పడ్డారు.హిందీలో పరీక్షలు వగైరాలు.గృహిణులు కూడా హిందీ నేర్చుకొన్నట్లు నాకు గుర్తు.స్వాతంత్రసమరంలో పాల్గొన్న వారు చాలామందే అతివలు
గాంధీజికి శిష్యులైనారు.  
  హిందీలో సాహిత్యం
హిమాలయంలా
వెలిసింది. భక్తి వెల్లువై ప్రవహించింది.తెల్లని
ఆ భక్తి భావ పున్నమి వెన్నెలలో  భరతమాత
తడిసి పులకించినది.
కామెంట్‌లు