కాళిదాసు జీవిత విశేషాలు సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ

 సంస్కృతంలో మహాకావ్యాలు రాసిన కాళిదాసు జీవిత విశేషాలు కొంచెం తెలుసుకుందాం ఆయన భార్య పేరు విద్యోత్తమ. ఆయన ఎక్కడ పుట్టాడు జన్మస్థలం గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి పూర్తిగా భారతదేశమంతా తిరిగినా కవిగా గోచరిస్తాడు   బెంగాల్ దేశంలో పుట్టాడని ముర్షిదాబాద్ జిల్లాలోని గడ్డా సింగ్ అనే పల్లెలో జన్మించాడని ఆయన తల్లి పేరు కాళీ అని అంటారు బెంగాలీ వాళ్ళు దుర్గామాతని పూజిస్తారు అందుకే కాళికా అమ్మవారి అనుగ్రహంతో కాళిదాసు అయ్యాడని ఒక కథనం ఇక కొంతమంది కాశ్మీర్ ప్రాంతం వాడని అందుకని ఆయన సాహిత్యం లో హిమాలయాల సజీవ వర్ణన అద్భుతంగా ఉంటుందని అన్నారు ఇంకొంతమంది అస్సాం ప్రాంతం వాడని మరికొంతమంది మహారాష్ట్రలోని రామ్ టేక్ అనే కొండ ప్రాంతంలో వాడని అంటారు మాల్వా మాల్వా లోని ఉజ్జయిని కాళిదాసు ప్రస్తావిస్తాడు మహా కాల మందిరాన్ని అద్భుతంగా వర్ణిస్తాడు ఇక ఇంకొంతమంది ఏమంటారు అంటే ఆయన దేశమంతా పర్యటించి అక్కడి ప్రకృతిని మనుషులని వాతావరణాన్ని తన కావ్యాలలో పొందుపరిచాడని అభిప్రాయపడ్డారు ఆయన పుట్టుక విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కొంతమంది క్రీస్తు పూర్వం వాడని ఇంకొంతమంది విక్రమ్ సంపత్తులు ఉజ్జయిని రాజా విక్రమాదిత్యని నవరత్నాలలో ఒకడని అంటారు ఇంకో అభిప్రాయం ఏంటంటే కాళిదాసు శృంగవంశ రాజైన అగ్ని మిత్రుని ఆస్థాన కవి అని చెప్తారు గుప్తవంశ మహారాజు రెండవ చంద్రగుప్తుడి సమకాలీనుడు అని ధారాప్రాంతపు రాజైన భోజిని ఆస్థాన కవి అని భావిస్తారు గుప్తవంశ కుమార్ గుప్తుని ఆస్థానంలో క్రీస్తుశకము నాలుగవ శతాబ్దిలో కాళిదాసు ఉన్నాడని చరిత్రకారుల అభిప్రాయం గుత్తుల పాలన స్వర్ణ యుగం సంస్కృత భాష బాగా ప్రాచుర్యంలో ఉండేది కాళిదాసు ఎక్కడ పుట్టినా ఏ కాలంలో పుట్టిన మహాకవిగా తను దర్శించిన ప్రాంతాల్ని తన కవితల్లో ప్రస్తావించాడు అక్కడి ప్రకృతి రమణీయతను వర్ణించాడు హిమాలయాలు కావేరీ నది మలయ పర్వతాలు త్రికోట పర్వతం కాశ్మీరం ఇలా అన్ని ప్రాంతాలను సందర్శించి అక్కడి వాతావరణాన్ని సంగీత దృశ్య కళలను బాగా పరిశీలించి తన సాహిత్యం లో వివరంగా వర్ణించాడు స్కందగుప్తునికాలంలో  హూణుల దండయాత్ర. మొదలైంది.భారతీయులు అనేక  అగచాట్లు పడ్డారు.కోమల హృదయుడైన కాళిదాసు కి మిత్రుడైన స్కందగుప్తుని మరణం బాగా కృంగదీసింది. వైరాగ్యం నిరాశతో ఆయన జీవితం చాలించాడు అని చరిత్ర కారుల అభిప్రాయం🌹
కామెంట్‌లు