కవిత్వలక్షణాలు:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కవిత్వం
చూపాలి పదచిత్రాలు
వాడాలి తగుప్రతీకలు
తట్టాలి అంతరంగాలు

కవిత్వం
ఒక్క కుటీరానికో
కొద్ది కాగితాలకో
కారాదు పరిమితము

కవిత్వం
కురవాలి టపటపా
పారాలి గలగలా
మ్రోగాలి గళగళా

కవిత్వం
గుమ్మంగుండానో
కిటికీగుండానో
పరుగెత్తాలి బయటకు

కవిత్వం
కళ్ళద్వారానో
శబ్దంద్వారానో
చేరాలి మనసుకు

కవిత్వం
పాఠకులకు
శ్రోతలకు
వేయరాదు సంకెళ్ళు

కవిత్వం
సుమములా
సుగంధంలా
ఆకర్షించాలి హృదయాలు

కవిత్వం
తీర్చాలి కాంక్షలు 
ఇవ్వాలి అనుభూతులు
కూర్చాలి ప్రత్యక్షఙ్ఞానము

కవిత్వం
చూపించాలి అందాలు
కలిగించాలి ఆనందము
చేకూర్చాలి శాంతము 

కవిత్వం
చిమ్మలి కాంతికిరణాలు
చల్లాలి వెన్నెలజల్లులు
చూపాలి తళుకుబెళుకులు


కామెంట్‌లు