పోలయ్య కవికిమహిళా దినోత్సవం సందర్భంగాసాహితీ సత్కారం.
 .హైదరాబాద్ రవీంద్రభారతిలో...శనివారం  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా...విమల సాహితీ సమితి  వ్యవస్థాపకులు
డాక్టర్ జల్దీ విద్యాధర్ ఆధ్వర్యంలో...కళారత్న డాక్టర్.బిక్కికృష్ణ అధ్యక్షతన... శ్రీమతి తురుమెళ్ళ కళ్యాణి వ్రాసిన" కలం నా గళం" పుస్తకావిష్కరణ సభ జరిగింది
ఎమ్మెల్సీ ప్రముఖ వాగ్గేయకారుడుగోరేటి వెంకన్న పుస్తకాన్నిఆవిష్కరించారు.  ఒంగోలు వాస్తవ్యులు ప్రముఖ కవి డాక్టర్ బీరం సుందర్రావు...అద్భుతంగా పుస్తక సమీక్ష చేశారు
ఈ సందర్భంగా డా.ఉషారాణి...ఝాన్సీ ముడుంబై సమన్వయకర్తలుగా నిర్వహించిన కవి సమ్మేళనంలో దాదాపుగా 
4000 కవితలు వ్రాసిన ప్రముఖ కవి రచయిత పోలయ్య కూకట్లపల్లి పాల్గొని...
"మహిళా మణిదీపం"శీర్షికతో...
మహిళా..! ఓ మహిళా..!
నీవు అంగడి బొమ్మవు కాదని...
ఆకలి తీర్చే అమ్మవని...
అనురాగ దేవతవని...
నీవు ఒక అబలవు కాదని...
ఆదిపరాశక్తివని...
నీవు జగతికి నవజీవమని...
ప్రగతికి ప్రతిరూపమని...
చీకటిలో చిరుదీపమని...
నీవు కష్టాల కడుపులో
పుట్టిన కలువ పువ్వువని...
నీ చల్లని ఒడిలో
ఒక బడి ఒక గుడి ఉందని...
నీవు మహిలో మణిదీపమని...
నీవు బ్రహ్మకు ప్రతిరూపమని...
ఎప్పుడు ఈ సమాజం నిన్ను గుర్తిస్తుందో
అప్పుడే ఈ దేశం పురోగమిస్తుందని...
ఒక కమ్మని కవితను చదివి వినిపించారు
తదనంతరం...ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న...
డా బిక్కి కృష్ణ...డా. జల్దీ విద్యాధర్...
పుస్తక రచయిత్రి శ్రీమతి కళ్యాణి...
పోలయ్య కవి కూకట్లపల్లిని ఘనంగా సన్మానించారు.
ఈ సభలో శ్రీ భగీరథ...మంజుల సూర్య...
శైలజా మిత్ర...తదితర సాహితీమూర్తులు ప్రసంగించారు రచయిత్రి శ్రీమతి కళ్యాణి పై ప్రశంసల వర్షం కురిపించారు...
"కలం నా గళం" కవయిత్రి శ్రీమతి తురుమెళ్ళ కళ్యాణి...తన సభను దిగ్విజయం చేసినందుకు ఆనందభాష్పాలతో అతిథులకు ఆహుతులకు అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు.
దాదాపుగా 75 మంది కవులను కవయిత్రులను
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 
సందర్భంగా ఘనంగా సత్కరించారు
సభ అంగరంగ వైభవంగా ముగిసింది.

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
వేదాంత సూరి గారు మీకు నమస్కారములు... నా సాహితీ మిత్రుడు కావ్య సుధ ఏదో ఒక రోజు మిమ్మల్ని మీ నిస్వార్థ సాహితీ సేవను కృషిని గుర్తు చేస్తూనే ఉంటారు. నా ఈ సన్మానం వార్తను చాలా రోజుల తర్వాత అభిమానంతో ప్రచురించినందుకు... నాకు ఒక తీపి జ్ఞాపకాన్ని మీరు అందించినందుకు... మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు... కారణం "వంద కవితల కన్న ఒక సన్మానం మిన్న"గనుక...మీ ఆత్మీయ సాహితీ మిత్రుడు మీ శ్రేయోభిలాషి పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్
అజ్ఞాత చెప్పారు…
Congrats kalaratnamaa!!