విద్యార్థుల పరీక్షలకు సంబంధించి అభ్యసన సామాగ్రి పంపిణి

 సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం  తెలుగు భాష ఉపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాసరావు తన సొంత ఖర్చుతో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలకు సంబంధించి అభ్యసన సామాగ్రిని అందించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి రజిత, ఉపాధ్యాయులు విజయ భాస్కర్, రవీందర్, చవాన్ సుభాన్ సింగ్ పాల్గొన్నారు. విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు.
 
కామెంట్‌లు