ఇది ఆకాశమంత తివాచీల 1600 ఊడలతో 6.2 ఎకరాల విస్తీర్ణంలో పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తున్నది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిమ్మమ్మ మర్రిమాను. అనంతపురం జిల్లా కేంద్రానికి 112, కదిరికి 25 కిలోమీటర్ల దూరంలో నంబులపూట కుంట మండలం గూటి జైలు గ్రామంలో తన కళ్ళు దగ్గర విస్తరించి ఉన్న ఈ మర్రి మానువయసు 600 సంవత్సరాలు.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ప్రపంచంలో అతి పెద్దదైన మర్రి చెట్టుగా పేరు సంపాదించుకుంది. ఈ చెట్టు కింద ఉన్న దేవాలయంలో దైవంశ సంభూతులుగా పేర్కొన్న తిమ్మమ్మ అనే పతివ్రత పేరునే ఈ మహా వృక్షానికి పెట్టారు. 1976 సంవత్సరంలో నాలుగు ఎకరాల 10 సెంట్లు ఉన్న ఈ మహా వృక్షం 1990 నాటికి 5.2 ఎకరాలకు విస్తరించి నేటికీ 6.2 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చెంది పర్యాటకులకు అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే ఈ మహావృక్షం వెనుక ఆసక్తికరమైన ఒక కథ ఉంది.
తిమ్మమ్మకు గూటిబైలు గ్రామానికి చెందిన బాల వీరయ్యతో వివాహం జరిగింది. కొద్ది రోజులకే బాల వీరయ్య వ్యాధిగ్రస్తుడై చనిపోవడంతో తిమ్మమ్మ భర్తతోపాటు తనువు చాలించడానికి పూనుకుంది. అందరూ చూస్తుండగానే సిటీలో దూకి సహగమనం చేసుకున్నది. తర్వాత కొంతకాలానికి ఆ చీటీ మండిన ప్రాంతంలో ఒక మర్రి చెట్టు మొలకెత్తి నేడు తిమ్మమ్మ మర్రిమానుగా పిలువబడుతూ ప్రఖ్యాతిగాంచింది.
కదిరి తాలూకా గుత్తి బయలు గ్రామపు సరిహద్దుల్లో ఈశ్వరమ్మ రిజర్వు ఫారెస్ట్ ను అనుకొని ఎన్ని వందల సంవత్సరాలుగాను విస్తారమై ఉన్న ఈ మర్రి చెట్టుకు పూజలు చేసిన వారి కోరికలు నెరవేరుతాయని అక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసము.
తిమ్మమ్మ మర్రిమాను.:- తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి