సర్కారు బడుల్లో సకల సౌకర్యాలతో పాటు ఉచిత 'క్వాలిటీ ఎడ్యుకేషన్' అందిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి, ఉచిత విద్యా సౌకర్యాలను వినియోగించుకోవాలని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య కోరారు. కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (పిల్లల స్వయం అభ్యసన కేంద్రం) లో గురువారం భోజన విరామ సమయంలో ఒకటో తరగతి విద్యార్థి రిషి కీర్తన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. హెచ్ఎం ఈర్ల సమ్మయ్య పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి రిషి కీర్తన్ కు స్వీట్లు తినిపించి, నిండు నూరేళ్లు వర్ధిల్లాలని దీవించి ఆశీర్వదించారు. పాఠశాల పిల్లలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు కృత్యాధార, కాన్సెప్ట్ బేస్డ్ విద్యను అందిస్తున్నామన్నారు. క్షేత్ర పరిశీలనలు, ప్రయోగాలు చేయిస్తూ వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బును వృధా చేసుకోకుండా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఉచిత విద్యా సౌకర్యాలను పొందాలని ఆయన కోరారు. కార్యక్రమంలో హెచ్ఎం ఈర్ల సమ్మయ్య, టీచర్లు అమృత సురేష్ కుమార్, కొనుకటి శ్రీవాణి, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య;--రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈర్ల సమ్మయ్య

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి