తార!!!:- డా ప్రతాప్ కౌటిళ్యా
ఒక మాట-ఒక నవ్వు 
ఒక బహుమతి 
శూన్యానికి -సునీత!!!

ఒక సందేశం-ఒక సమాచారం 
ఒక ప్రపంచం-ఒక సంకేతం 
విశ్వానికి-సునీత!!!

ఒక అమ్మ ఒక శ్రీమతి 
ఒక ప్రేమ ఒక స్నేహం 
శూన్యానికి సునీత!!!!!

ఆకుపచ్చని తార భూమి 
ఎర్రని తార సునీత!!!?

స్థల కాలాలు లేకుండా 
జనన మరణాలు కాకుండా 
జీవం పదార్థం సునీత 
సూర్య కుటుంబంలో!!!!

నియమాలతో పని చేస్తున్న 
విశ్వం 
ఎప్పుడు గతితప్పలేదు!!

సూత్రాలతో పని చేస్తున్న 
శాస్త్రం 

మనిషి అస్త్రం!!!

నమ్మకం కాదు నిజం విజయం ఇది!!
దివి నుంచి భువికి దిగుతున్న దేవతా ఆమే!

సునీత విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరాలని ప్రార్థిస్తూ!!

డా ప్రతాప్ కౌటిళ్యా 👏
కామెంట్‌లు