శ్రమను నమ్ముకోండి - లక్ష్యాలను చేరుకోండి

 విద్యార్థులంతా శ్రమను నమ్ముకోవాలని, శ్రమిస్తే లక్ష్యసాధనకు మార్గం సుగమం కాగలదని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు. పాఠశాలలో నిర్వహించిన పదోతరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ గతేడాది కంటే మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు మరింత కీర్తి ప్రతిష్టలు చేకూర్చాలని అన్నారు. సీనియర్ సహోపాధ్యాయులు తూతిక సురేష్ మాట్లాడుతూ విద్యార్థులంతా కృషి పట్టుదలతో పాటు, అంకితభావంతో శ్రమించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపిటిసి వలురోతు గోవిందరావు, పాఠశాల యాజమాన్య కమిటీ వైస్ చైర్మన్ కిల్లారి జయసుధలు వేదికనలంకరించి ప్రసంగించారు. విద్యార్థులంతా తమ తమ విద్యా స్థాయిని పెంపొందించుకుంటూ సత్ఫలితాలను సాధించే దిశగా పయనించాలని, స్వర్ణమంటి భవితవ్యాన్ని పొందాలని వారంతా తమ తమ ప్రసంగాలలో ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతికి సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్ర కుమార్, రబికుమార్ మహాపాత్రో, సుస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన, స్వాగత గీతం, దేశభక్తి గీతాల అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యరూపకాలు సభను ఆకట్టుకున్నాయి. వారి కళలు ప్రేక్షకుల అభినందనలు పొందాయి. ఈ కార్యక్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులనందజేసి ప్రోత్సహించారు.
కామెంట్‌లు