అమ్మ అమృత పలుకులు:--గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు
బుర్రలోని బూజును
పర భాషపై మోజును
దులుపుకున్న మంచిది
మాతృభాష గొప్పది

చులకనైన భావనను
అవినీతి సంపదను
మానుకున్న క్షేమము
తొలగిపోవు క్షామము

పనికిరాని పనులను
చెత్తలాంటి తలపులను
వదులుకున్న లాభము
లేదంటే నష్టము

మితిలేని వ్యసనాలను
అదుపులేని కోరికలను
నియంత్రిస్తే బాగు! బాగు!
చేయకోయి! ఇక జాగు


కామెంట్‌లు