చెట్లు -( ఉయ్యాల పాట )- - మన్నెం జయంత్ - పుట్టం నీల్ కుమార్ - ఏడవ తరగతి జడ్పీహెచ్ఎస్ తాటికల్, నకిరేకల్ మండలం, నల్గొండ జిల్లా

 ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో
 ఉయ్యాల ఓ రామ ఉయ్యాలో 
 చెట్లను పెంచాలే ఉయ్యాలో
 ప్రకృతిని కాపాడు ఉయ్యాలో
 భారత దేశంలో ఉయ్యాలో
 ఎన్నెన్నో చెట్లు ఉండే ఉయ్యాలో
 అడవులెన్నో ఉండే ఉయ్యాలో 
 అందంగా ఉండెను ఉయ్యాల
 చెట్ల నువ్వు కొట్టేస్తే ఉయ్యాలో
 కాలుష్యము పెరుగు ఉయ్యాలో 
 చెట్లను నరికితే ఉయ్యాలో 
 వర్షాలు లేవయ్య ఉయ్యాలో 
 పచ్చదనము ఉంటే ఉయ్యాలో
 స్వచ్ఛదనం వచ్చును ఉయ్యాలో
   
         
కామెంట్‌లు