మంచి మనసుం టే :- డాక్టర్ సి వసుంధర చెన్నై
 రాదు రాదు రాదేమో అనుకున్నరోజు రానే వచ్చింది.ఎప్పుడైనా అంతే, కాదు కాదు 
అనుకున్నది అయిపోతుంది.
ఎన్నో ఆశలతో ఉన్నప్పుడు
నిరాశపరచడం, నిరాశలో మునిగిపోయిన వారిని ఒక నిమిషంలో ఆశల సంపదను చేతికి అందివ్వడం
కాలపురుషునికే సాధ్యం. 
ఆలోచనలో మునిగిపోయిన మీనాక్షి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. "నా ఆలోచనలు పాడుగాను పిల్ల అంత దూరం నుంచి వస్తుంటే యిలా నిలబడిపోయి ఉన్నానేంటి" "అనుకుంటూ .
వంటింట్లోకి వెళ్ళింది
మీనాక్షి.
కూతురు పెళ్లికూతురు కాబోతున్నదని సంతోషంగా మీనాక్షి వచ్చే పెళ్లి వారి కోసం, కూతురు సుప్రియ కోసం  లడ్డు, మణిగు పూలు, కారాసు అన్ని ఓపిగ్గా చేసి గ్లాసు  సీసాలోభద్రపరిచింది.
పొద్దుటి నుంచి రాత్రి 11 వరకు ఇవన్నీ చేసిన మీనాక్షికి నడుము పట్టేసింది.
"ఎందుకమ్మా ఇవన్నీ చేస్తావు బయటే దొరుకుతున్నాయికదా" అన్న చిన్న కూతురు మాటలకు,
రేపు నీకు బిడ్డలు పుడితే గాని  తెలియదు లేవే. తల్లి మనసు" అంటూ కూతురి చేత నడుముకు మందు రాయించుకుని 
పడుకున్న మీనాక్షి 
ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని నిద్ర పట్టని లేదు. 
          🫘
"అమ్మ వచ్చేసాగా" అన్న మాటలు వంటింట్లోకి వినపడి మీనాక్షి గబగబాహాల్లోకి వచ్చింది.
ఎదురుగుండా కూతురు కనిపించింది. 
సంతోషంతో కూతురుని గుండెలకు హత్తుకోవాలని ముందుకు పోబోయే 
 మీనాక్షికి కూతురు పక్కనే ఓ తెల్ల దొర 
ప్రత్యక్షమయ్యాడు. 
మీనాక్షి ఒకడుగు వెనక్కు వేసి "ఎవరే?" అన్నట్లు కూతురు వైపు చూచింది. 
"అమ్మ ఇప్పుడే చెప్పేేయ్యమంటావా తర్వాత చెప్పనా?" అన్న కూతురు మాటలకు మీనాక్షి కొంచెం షాక్ అయింది. 
ఏమిటే అది? చెప్పేదేదో ఇప్పుడే చెప్పు"అన్నది మీనాక్షి కొంచెం గాభరాగా.
 
"ఈ అబ్బాయి నా బ్రదర్. బ్రదర్స్ లేని నాకు అమెరికాలో దొరికిన బ్రదర్. 
ఇప్పుడు రేపు నన్ను చూడ్డానికి వస్తారే 
  పెళ్లి కొడుకు ఆ పెళ్ళికొడుకు నా బ్రదర్కు ఫ్రెండే  
మా పెళ్లి చూపులు, మాటలు అన్ని ఫినిష్.
అమెరికాలోనే.
ఇక పెద్దలు మీరు మీరు మాట్లాడుకుని మా పెళ్లి చేయడమే 
తర్వాత కార్యక్రమం."
అంటూ అమ్మ భుజాలపై వేసింది
సుప్రియ. 
మీనాక్షమ్మకు అంతా ఏదో మాయగా అనిపించింది కాసేపు. 
ఏంటి పెళ్లిచూపులు అయిపోయాయా! "
అంది ఆశ్చర్యంగా. 
"అవునమ్మా! అన్ని అయిపోయాయి.
నిన్ను సర్ప్రైజ్ చేస్తామని చెల్లెలు, నేను, నా బ్రదర్, నాకు కాబోయే మా వారు అందరం కలిసి ఇలా ప్లాన్ చేశాము 
.నువ్వు థాంక్స్ చెప్పాల్సింది ఇదిగో ఈ బ్రదర్ కి అంటే నీకు దైవమిచ్చిన కొడుక్కి"
అన్న కూతురు మాటలకు మీనాక్షి కళ్ళల్లో 
నీళ్ళు తిరిగాయి. "అండలేని నాకు ఈ పిల్లల పెళ్లిళ్లు ఎలా చేస్తానో అని కుమిలి
పోతున్నానయ్య"
అని తెల్లదొరతట్టు చూస్తూ," ఆయనకు మన భాష తెలియదు కదా నువ్వు చెప్పవే" అంది కూతురుతో మీనాక్షి. 
"అమ్మ! ఇకనుంచి నిశ్చింతగా ఉండండి.
మా సిస్టర్స్ మ్యారేజస్ 
చేసే బాధ్యత నాది. మీకు కొడుకు లేడని దిగులు పడకండి. నేనున్నాను"
అన్న తెల్ల దొర తెలుగులో మాట్లాడిన మాటలకి మీనాక్షి తెల్ల పోయింది.
అమా! ఆకలేస్తుంది.
నువ్వు చేసినవన్నీ తీసుకొని రా అన్నయ్య నేను అందరం తిందాం అన్న సుప్రియ మాటలకు మీనాక్షి  ఒక నిమిషంలో తినుబండారాల
సీసాలతో ప్రత్యక్షమైంది.

కామెంట్‌లు