న్యాయాలు -801
"ఆలస్యాత్ అమృతం విషం న్యాయము
*****
ఆలస్యాత్: అనగా ఆలస్యం వల్ల.అమృతం అనగా మరణం లేనిది , నిత్యం ఉండటం, అమరత్వం.విషం అనగా హాని కలిగించే, మరణానికి కారణమయ్యేదీ, హాలాహలం,గరళం అనే అర్థాలు ఉన్నాయి.
ఆలస్యం చేయడం వల్ల అమృతమూ విషమై పోతుందని అర్థము.
ఆలస్యం చేస్తే అమృతమైనా విషమవుతుంది అంటే చేయవలసిన పనిని నిర్థిష్టమైన సమయంలో జరుగకపోవడం వల్ల అనర్థం కలుగుతుంది కాబట్టి నిర్థిష్టమైన సమయంలో చేయమని హెచ్చరిస్తూ చెప్పే వాక్యమే "ఆలస్యం అమృతం విషం ". కాబట్టి ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయాలి.
" సిద్ధమన్నం ఫలం పక్వం/నారీ ప్రథమ యవ్వనం/ కాలక్షేపం న కర్తవ్యం/ ఆలస్యం అమృతం విషం"అనేసంస్కృత శ్లోకంలోంచి తీసుకోబడిన న్యాయము.
అనగా అన్నం సిద్ధంగా ఉన్నప్పుడు,పండిన ఫలం ఉన్నప్పుడు,యవ్వనంలో స్త్రీ ఉన్నప్పుడు కాలక్షేపం చేయకూడదు.సమయం వృధా చేస్తే వండిన అన్నం పాడైపోతుంది.పండిన ఫలం కుళ్ళిపోయి తినకుండా పాడైపోతుంది.స్త్రీ యవ్వనం అంటే "ఏ వయసులో ముచ్చట ఆ వయసులోనే తీరాలి. వివాహం జరగాలి ఆలస్యం చేసిన కొద్ది అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి.కాబట్టి "ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుంది' అని అర్థము.
తరచుగా కొన్ని ఆలస్యాలు చేసి ఆపైన తీరిగ్గా బాధపడే సందర్భాలు కొన్ని ఉంటాయి. తప్పనిసరిగా వెంటనే చేసే పనుల పట్ల అలసత్వం పనికిరాదు. ఆ అలసత్వంతో కూడిన ఆలస్యం జీవితాంతం బాధ పడేలా చేస్తుంది. అవేమిటో చూద్దాం.
కొన్ని ముఖ్యమైన పరీక్షలు ఉంటాయి. వాటికి ఒక్క నిమిషం ఆలస్యం అయినా రాయడానికి అనుమతించరు. ఎప్పటినుండో బాగా చదివి పరీక్షపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వ్యక్తి ఆ ఒక్క నిమిషం ఆలస్యం వల్ల ఎంత కోల్పోతాడో అర్థం చేసుకోవచ్చు. అలాగే బస్సు, రైలు, ఫ్లైట్ రిజర్వేషన్ చేయించుకుని సమయాన్ని సరిగ్గా సర్దుబాటు చేసుకోలేక, హడావుడిగా అవకతవకలు చేస్తూ ఏ మాత్రం ఆలస్యం చేసినా అటు డబ్బు ఇటు చేరాల్సిన గమ్యానికి చేరలేక ఎంత మానసిక వ్యధ పడతామో వేరే చెప్పక్కర్లేదు.
అందుకే ఏపని చేయాలన్నా పక్కా ప్రణాళిక కావాలి అంటారు పెద్దలు. పెద్దలు ఇంకో మాట కూడా "శుభస్య శీఘ్రం" అని కూడా అన్నారు.అంటే ఏదైనా మంచి పని చేయాలి అనుకున్నప్పుడు వెంటనే మొదలు పెట్టాలి. ఎలాంటి తాత్సారం చేయకుండా, మీనమేషాలు లెక్కించకుండా, వీలైనంత త్వరగా చేయాలి అని అర్థము."ఇక "రేపటి పని ఈరోజే చెయ్యి.ఈరోజు పని ఇప్పుడే చెయ్యి" అన్నారు కబీర్ దాసు.
కాబట్టి ఏదైనా పనిని తలపెట్టినప్పుడు ముందు చక్కని ప్రణాళిక వేసుకోవాలి. దానికి కావలసిన సహాయాన్ని ఆప్తులైన వారి నుండి తీసుకుని ప్రారంభిస్తే ఏ పనైనా చక్కగా నెరవేరుతుంది.
"ఆలస్యం అమృతం విషం" అనే పదం మన నిత్య జీవితంలో రాకుండా జాగ్రత్త పడాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి