అది చల్లని జ్యోత్స్న
ఆఫీసు పనులతో అలసిపోయిన శరీరాలను కాస్త ఆనంద లోకాలకే తీసుకెళ్లడానికి నేను, మధు అలా ఎగిరిపోయాం.
పోయి పోయి అండమాన్ సుందర సముద్ర తీరాన చేరాం.
అది నీలి సముద్రం.
మనకున్న సప్తసముద్రాలలో నీలి సముద్రం ఒకటి కాబోలు!
చూస్తుంటే ఏదో అనర్వచనీయమైన
హాయి ,మదినంత
దోచేస్తున్నది.
నీలీ సముద్రానికి తెల్లని అంచులా వెన్నెల వెన్నకన్నా మెత్తగా తాకుతున్నది శరీరాలను.
నేను ,మధు చేతులు చేతులు పట్టుకుని సముద్రపు ముంగిట నిలబడ్డాం.
సముద్రుడు గలగల ఆలలతో నవ్వుతూ,నవ్వుతూ
వచ్చి మాపాదాలు కడిగి పోయాడు.
మధు మేనీఛాయ
వెన్నెలకు పోటీపడుతున్నది.
సన్నని ఆమె దంతాలు
సన్నజాజులవలె మెరుస్తున్నాయి.
మధు ఒడిలో తల పెట్టుకుని పడుకున్న నాకు స్వర్గాన్ని తలుచుకుంటే వెగటేసింది. మధు నా తట్టు చూచి,
ఏంటి రా!ఆ చూపు.
నేనేమైనా కొత్తదానినా? అన్నాది
సన్నజాజులకు పెదిమల మూత తీసి చూపిస్తూ.
అవును కొత్త దానివి. నా చెలి నూతనత్వం నిత్య నూతన పుష్ప సదృశ్యం. అసలే నా మధు సన్నిధి, అదొక ప్రేమ జలది. దానికి తోడు ఈ నీలిసముద్రం, ఈ జ్యోత్స్న. ఇంతకన్నా నాకేం కావాలి అన్నాను నేను మధు ప్రేమ సముద్రంలో ఈదుతూ.
"సార్ సముద్రం లోపలికి వెళ్లే ఏర్పాటు పూర్తయినాయి వస్తారా" వస్తారా? అంటూ బాయ్ వచ్చి నా కలలను చెదరగొట్టాడు.
మధు చిన్నపిల్లలా,
"మీరు రాత్రికి నిద్రపోయి హాయిగా కలలు కందురు ప్రేమ సముద్రపు లోతులు చూద్దురు .
ముందు పదండి ఈ నీలినీళ్ల సముద్రం
నూతన చూచి ఎంజాయ్ చేద్దాం అంటూ పైకి లేచింది.
నాకు నా అ వాతావరణం
చూస్తుంటే, నా మదుతో అక్కడే జీవితాంతం గడిపేయాలనిపించింది. నిజంగా కోరుకున్న జంట దొరికితే, అనుకున్న హాయి గొలిపిచోటు దొరికితే అంతకన్నా ఆ స్వర్గంలో ఏముంది? చెప్పండి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి