మహిళ మూర్తి-స్త్రీ శక్తి ముందుగా మిత్రులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎప్పుడో 1917 లో రష్యాలో ప్రారంభమైన ఈ వేడుక/ఉద్యమం నేడు ప్రపంచం అంతా జరుపుకుంటున్నది. బాగానే ఉంది..కానీ మహిళలకి ఒక రోజు అని కేటాయించుకోవటం అనే మాటే హాస్యాస్పదం. సృష్టిలో సగమైన స్త్రీకి ఒక రోజేమిటి? ఒక కాల పరిమితి ఏమిటి? దక్ష యజ్ఞంలో సతీ దేవి ఆత్మార్పణం అయ్యాక..శక్తి విహీనమైన విరక్తితో మౌన ముని రూపం దాల్చిన పరమ శివుడిని అలా వదిలేస్తే లాభం లేదని..ఆయనని కదిలించి పునః సృష్టిని ప్రారంభింపజేసింది ఎవరు? ఆయనలోని స్త్రీ శక్తే కదా. నటరాజుగా ఆయన నాట్యం చేస్తే..నాట్యం లోని హావభావ రూపకమైన లాస్యం ఆవిడే! ఆయన వాక్కు అయితే..ఆవిడ అర్థం! ఆయన జ్యోతి అయితే..నాలుగు దిక్కులకి ప్రసరించే ఆ దీప కాంతి ఆవిడే! ఆయన పువ్వు అయితే పరిమళం ఆవిడే! ఆయన కన్ను అయితే..చూపు ఆవిడే! పైన చెప్పిన వాటిలో..దేన్ని అయినా ఒక దాని నించి రెండవ దాన్ని విడదియ్యగలమా? అలాంటి స్త్రీకి కాలపరిమితి ఏమిటి? "కార్యేషు దాసి, కరణేషు మంత్రి భోజ్యేషు మాత, రూపేచ లక్ష్మి శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ" అని ఆవిడని గృహానికి పరిమితం చేశారు అని నా సోదరీమణులు కొందరు ఆక్రోశిస్తే.. దాని అర్థం అది కాదు..ఆమె అన్ని పాత్రలు ఏక కాలంలో అవలీలగా, సహనంతో, సమర్ధతతో, విజయవంతంగా నిర్వహించగలదు పిచ్చి వాళ్ళల్లారా అనాలనిపిస్తుంది. అష్టావధానాలే కాదు..సహస్రావధానాలు అవిశ్రాంతంగా చెయ్యగలదు అని ఆమె శక్తిని తెలియజెయ్యటమే ఆ శ్లోక పరమార్థం అంటాను..మీరేమంటారు. అలా ఆమెని నిర్వచించిన నీతి శాస్త్రమే పురుషుడు ఎలా ఉండాలో కూడా చెప్పింది.. "కార్యేషు యోగీ, కరణేషు దక్షః రూపేచ కృష్ణః క్షమయా తు రామః భోజ్యేషు తృప్తః సుఖ దుఃఖ మిత్రం షట్కర్మ యుక్తః ఖలు ధర్మ నాథః" -కార్యేషు యోగీ..పనులు చెయ్యటంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి. -కరణేషు దక్షః..కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించే సమర్ధుడై ఉండాలి. -రూపేచ కృష్ణః..రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి. -క్షమయాతు రామః..ఓర్పులో రాముని లాగా ఉండాలి. పితృవాక్య పరిపాలకుడైన రాముని వలె క్షమా గుణం కలిగి ఉండాలి. -భోజ్యేషు తృప్తః..భార్య/తల్లి వండిన దాన్ని సంతృప్తిగా, వంకలు పెట్టకుండా తినాలి. -సుఖ దుఃఖ మిత్రః.. సుఖ దుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి. కానీ ఇలా ఎంత మంది పురుషులు తమ వంతు పాత్ర పోషణ చేస్తున్నారు? అలా లేకపోబట్టే స్త్రీలు వీధుల్లోకి వచ్చి తమకి సమాన హక్కులు కావాలి అని నినదించవలసి వస్తున్నది. "ఆయనే ఉంటే మంగలి ఎందుకు" అనే సామెతలో చెప్పినట్లు, ఎవరి కర్తవ్యం వారు నిర్వహిస్తే..నినాదాలతో పనేముంది? ఉద్యమాలతో అవసరం ఏముంటుంది? అసలు ఇలాంటి సందర్భాల్లో..స్త్రీలకి స్త్రీలే సన్మానాలు చెయ్యటం..ఆమె విజయాల గురించి వారే ప్రశంసించటం కాకుండా..పురుషులు తాము సాధించిన విజయాల వెనుక ఉన్న స్త్రీల గురించి (నిస్సందేహంగా వారు ఉంటేనే సాధించగలరు) నిజాయితీగా మాట్లాడమని, వారి జీవితంలో స్త్రీ పాత్రల గురించి...తల్లో, భార్యో, సోదరో, కూతురో... గొప్పతనం గురించి బేషరతుగా మాట్లాడమని కోరాలి. ప్రతి సంవత్సరం పురుషుల చేత స్త్రీలకి సన్మానం చేయించాలి. ఎందుకంటే, ఒక స్త్రీ పొత్తులో ఆమెని ప్రత్యక్షంగా చూసి, ఆమెతో దైనందిన అనుభవాన్ని, ఆనందాన్ని తెలుసుకునేది అతనే కదా! స్త్రీలు సమాన హక్కులు అని కాకుండా, తమ బాధ్యతలు..అవి కార్యాలయాలు కానీ, గృహ స్థాయిలో కానీ, సమాజంలో కానీ.. సమానంగా పంచుకుని, అన్ని వేళలా తమకి అండగా ఉన్నాము అనే భరోసా కలిగించాలి అని కోరాలి. మీరేమంటారు. అప్పుడే..స్త్రీ తనకి అవకాశం దొరికినప్పుడు తన ప్రతిభని ఆకాశమే హద్దుగా ప్రదర్శించగలదు. సమాజాభి వృద్ధికి దోహదపడగలదు. దేశ ఆర్ధికానికి తన వంతు సమృద్ధిగా సమకూర్చగలదు. బాధ్యతగల భావితరాన్ని అందించగలదు. నిన్న మొన్నటి చంద్రయాన్ ప్రయోగంలో పాలుపంచుకున్న వారిలో అధిక భాగం స్త్రీలే అని మనందరికీ తెలుసు. ప్రయోగార్ధం అంతరిక్ష ప్రయాణం చేసి..కారణాంతరాల వల్ల ఎక్కువ కాలం అక్కడే ఉండి పోవలసి వచ్చిన నేటి సునీతా విలియంస్ గురించి ఎంత చెప్పినా తక్కువే! ఆ నాడు గార్గి వంటి స్త్రీలు వేదాధ్యయనం చేశారు.. రాణి అహల్యాబాయి హోల్కర్ లాంటి వారు రాజ్యాలు పరిపాలించారు. పురాణ కాలంలో ప్రకృతిని, మరణాన్ని కూడా శాసించగలిగిన అనసూయ, అరుంధతి, సావిత్రి సామాన్య స్త్రీలు కాదు. స్త్రీ విద్యకి, అభ్యుదయానికి పాటుబడిన దుర్గా బాయి దేశ్ ముఖ్, సావిత్రీ బాయి గురించి మనకి తెలుసు. ***** "యా దేవి సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా" సౌభాగ్య వతిగా (సంపదలకి అధిపతి అయిన లక్ష్మి) విష్ణు మూర్తి తో కలిసి విశ్వ నిర్వహణ చేస్తూ అర్హత కలవారికి లేదనకుండా అందలమెక్కించగలదు! "యా దేవి సర్వ భూతేషు లక్ష్మి రూపేణ సంస్థితా..." చదువుల తల్లి సరస్వతిగా విధాత చేత కర్మ జీవుల నుదుటి రాత రాయిస్తుంది! విద్యాదేవతై కవుల నాలుకపై నర్తించి, పండితులచే ఘంటం పట్టించి జ్ఞానాన్ని వెదజల్లే సహస్ర శీరుష ఆమే కదా! చదువురాని వారిని, చదువు అంటని వారిని "సరస్వతి కటాక్షం" లేదనటం వింటూంటాం! "యా దేవి సర్వ భూతేషు విద్యా రూపేణ సంస్థితా..." రాణి ఝాన్సి లక్ష్మి బాయి, రాణి రుద్రమ దేవి రూపంలో కత్తి పట్టి యుద్ధ విద్యలు నేర్చుకున్నారు..యుద్ధాల్లో పాలు పంచుకున్నారు, ఆత్మ త్యాగాలు చేశారు. "యా దేవి సర్వ భూతేషు రౌద్ర రూపేణ సంస్థితా" వన దేవతై లోకాన్ని రంగు రంగుల పువ్వులతో, భిన్నమైన ఫల సంపదతో శోభాయమానంగా చెయ్యగల శక్తి ఆమెకు కాక మరెవ్వరికుంది. స్త్రీత్వం లేని చెట్టు కాయలు కాయదని జగద్విదితమే కదా! "గంగ", "కృష్ణ వేణి", "కావేరి", "గోదావరి", "నర్మద", "సరస్వతి" రూపంతో జల దేవతై జీవుల దాహార్తిని తీరుస్తూ, భూమాతని సశ్య శ్యామలం చేస్తున్నది స్త్రీయే కదా! భూమాతై జీవులని మోస్తూ....వారి ఆగడాలు ఓర్పుగా భరిస్తూ... ఆహారాన్నందిస్తూ, బతకటానికి అవసరమైన ఖనిజాలని, లవణాలని తన లోపలి పొరల్లోంచి అందించి బతకటానికి అవసరమైన వస్తు సంపదని సమకూరుస్తున్నది స్త్రీ శక్తే కదా! "యా దేవి సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్థితా" సృష్టిలో ఇవన్నీ శక్తి స్వరూపమైన స్త్రీత్వ చిహ్నాలే! మాతృ మూర్తి అయి శిశువుని గర్భంలో 9 నెలలు మోసి, శిశు జనన సమయంలో ప్రసవ వేదనతో పునర్జన్మ ని పొంది లోకవ్యాపారం కొనసాగటానికి అవసరమైన మానవ వనరులనందిస్తున్న ఆమె సేవ గురించి చెప్పటం ఏ కవితరం? @@@@@ తనే స్వయంగా ఘంటం పట్టి "మొల్లమాంబ" అయి కావ్యాలు రాసింది. ధన్వంతరి అయి "ఆనంది బాయి జోషి" గా వైద్య సేవలందించింది. స్వయంగా కత్తే పట్టక్కరలేదు... మాతృమూర్తి అయి "జిజియా బాయి" గా శివాజి ని తీర్చి దిద్ది సామాజిక బాధ్యత నెరవేర్చ గలదు. "మదర్ థెరిసా" అయి స్వయంగా ఆర్తులని అక్కున చేర్చుకున్నది. "డొక్క సీతమ్మ" తల్లి అయి అన్నార్తుల ఆకలి తీర్చగలదు. "కల్పన చావ్ల" అయి అంతరిక్షంలోకి పయనించి ఆడవారి శక్తికి ఆకాశమే హద్దు అని నిరూపించ గలదు. "ఎమ్మెస్ సుబ్బలక్ష్మి" అయి తన గానంతో అలసిన హృదయాలకి సేద తీర్చగలదు. "యామిని కృష్ణ మూర్తి", "శోభానాయుడు" ల రూపంగా ఆనంద తాండవం చేసి నటరాజ సేవ చెయ్యగలదు. లెఫ్టినెంట్ "శివాంగి" అయి నౌకా దళ విభాగంలో సేవలందిస్తూ స్త్రీ శక్తికి పరిమితులు లేవని నిరూపించగలదు. లెఫ్టినెంట్ జనరల్ "పునీత అరోర", లెఫ్టినెంట్ జనరల్ "మాధురి కనిత్కర్" కెప్టెన్ "స్వాతి సింగ్" ల రూపంలో రక్షక దళంలో తన సత్తా చాటగలదు. ఎయిర్ మార్షల్ "పద్మ బందోపాధ్యాయ్" అయి వైమానిక దళంలో, సర్జన్ వైస్ ఎడ్మిరల్ "షీల ఎస్ మథై" అయి నావికా దళంలో తన సేవలు అందిస్తూ...ఇక్కడా అక్కడా అని లేకుండా, తన పట్టుదలే పెట్టుబడిగా మహిళల్లో స్ఫూర్తిని నింపుతూ ఆకాశంలో సగం "అతివ" అనే నానుడిని అక్షర సత్యం చేస్తున్న ఆమె శక్తిని వర్ణించటం, అంచనా కట్టటం ఎవరి తరం!! "ఇందిర", "షేక్ హసీనా" "ఏంజిలా మెర్కెల్" అయి దేశాలనే పరిపాలించ గలదు. పారిశ్రామిక వేత్త అయి సంపద సృష్టించగలదు. సైంటిస్టు అయి అంతరిక్షంలోకి ఎగరగలదు! సుచిత్ర ఎల్ల లాగా ఔషధాలు కనిపెట్టి ప్రాణ రక్షణ చెయ్యగలదు! విద్యావేత్త అయి భావి పౌరులని తీర్చి దిద్దగలదు! ఇది అది అని చెప్పలేని ఆమె విస్తృతిని చెప్పటానికి భాష చాలదు. అవునా..కాదా..మీరు చెప్పండి.
స్త్రీ మూర్తి- మహిళ శక్తి: - ఎం బిందు మాధవి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి