నిజమే కదూ!!:- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు
విజ్ఞానము వికసిస్తే
అజ్ఞానము మాయమగును
క్షమాగుణము చూపిస్తే
శత్రుత్వము దూరమగును

ప్రేమ నదులు ప్రవహిస్తే
వసుధైక కుటుంబమగును
సమైక్యత సాధిస్తే
విశ్వశాంతి సాధ్యపడును

కన్నోళ్లను పూజిస్తే
జీవితాలు వర్ధిల్లును
పెద్దలను గౌరవిస్తే
కుటుంబాలు బాగుపడును 

పిల్లలను ప్రేమిస్తే
అభిమానమెక్కువగును
మంచి దారి నడిపిస్తే
వారి భవిత చక్కబడును


కామెంట్‌లు