సుప్రభాత కవిత : - బృంద
బ్రతుకు దారిని బంధాలెన్నో
కదిలి మనతో వచ్చేవెన్ని?
వెదుకు కళ్ళకు అందాలెన్నో
వదలక ఎదలో నిలిచేవెన్ని?

తడిసిన  నేలను తడిమే కిరణం 
పసిడి రంగులు నింపే వైనం 
రాలిన పత్రపు పై నిలిచిన చినుకు 
మేలిమిముత్యంలా  తోచే అందం.

పుడమిని ప్రేమగా హత్తుకున్న 
పండుటాకు మేన  వింత రంగులు
నింపిన వెలుగు రేఖలు 
జిలుగులతో కొత్త జీవం నింపే అందం

నడిచే అడుగుకు కొత్తగా 
దడిచే మనసుకు తోడుగా 
గడిచే పయనపు నీడగా 
తడిచే కళ్లకు తోచే అందం

నిలిచిన మదిని రారమ్మని
పిలిచే తూరుపు వెలుగు
అలసిన మనసుకు బాసటగా 
వరమై దొరికిన వేకువ నేస్తానికి 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు