చల్లు చల్లు చల్లు
వెన్నెలజల్లు చల్లు
మదికి మోదమివ్వు
చల్లు చల్లు చల్లు
నవ్వులజల్లు చల్లు
మోములకు వెలుగులనివ్వు ||చల్లు||
చల్లు చల్లు చల్లు
పూలరెమ్మలు చల్లు
సంతోషములనివ్వు
చల్లు చల్లు చల్లు
కాంతికిరణాలు చల్లు
జగతిని చైతన్యపరచు ||చల్లు||
చల్లు చల్లు చల్లు
పన్నీటిబొట్లు చల్లు
పరిమళాలు వెదజల్లు
చల్లు చల్లు చల్లు
తేనెచుక్కలు చల్లు
నోర్లకు తీపినివ్వు ||చల్లు||
చల్లు చల్లు చల్లు
చక్కనిచూపులు చల్లు
ప్రేమాభిమానాలు చాటు
చల్లు చల్లు చల్లు
మధురవాక్కులు చల్లు
తనువులకు తృప్తినివ్వు ||చల్లు||
చల్లు చల్లు చల్లు
రాగసుధలు చల్లు
వీనులకు విందునివ్వు
చల్లు చల్లు చల్లు
అక్షరముత్యాలు చల్లు
కమ్మనికవితలు కూర్చు ||చల్లు||
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి