సుప్రభాత కవిత : - బృంద
బ్రతుకు పుస్తకంలో మరో పుట 
చీకటి తరువాత వెలుగేనట!
గతమెంత బలమైనదైనా 
భవిష్యత్తుకు అది  చరిత్రేనట!

పయనమెంత సులభమైనా 
గమ్యపు దూరం తగ్గదట!
గమనమెంత వేగమైనా 
సమయం గడవక తప్పదట!

వెలుగుల  మెరుపులు ఎన్నున్నా 
కలతల నీడలు తప్పవట!
కష్టం అయినా సుఖం అయినా
అడుగుల మధ్య దూరమేనట!

వేడుక పొంగు అరకనే
వేదన కుంగ దీయునట!
వేకువ వచ్చిన సంబరమంతా
మాపటి చీకటి వరకేనట!

ఏదీ శాశ్వతం కాకపోయినా 
అన్ని స్వంతమే అనిపించేనట!
తరాలకు చేరవేయాలనే తపనలో
తమ జీవితమే మరచు మాయట!

తెల్లార్లు కన్న కలలు 
చెల్లా చెదురైనా కూడా 
మళ్ళీ కలను కనగలగడమే 
మనుగడకు అర్థమట!

రోజూ వచ్చే సూరీడే అయినా 
కొత్తగా తోచే అందమట!
చెప్పకనే తలుపు తట్టి పిలిచి
చెలిమి పంచే వేలుపుకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు