చిక్కుముడి విప్పాలని
పెక్కు ప్రయత్నాలతో
చిక్కగ బిగిసిన దారం
చక్కగ మారె అవకాశం వుందా?
సమస్య కు భయపడి
పరుగులు పెడితే
పరిష్కారానికి దూరం
పెరిగినట్టేగా!
బెదిరి పోయి తప్పుకోక
ఎదురు నిలిచి పోరాడితే
గెలుపు రాకపోయినా
కలత ముగిసిపోవుగా!
తిన్నగా గమ్యం చేర్చే
ఎన్నుకున్న దారి ముఖ్యం
చిన్నగా నడచి కూడా
మిన్నగా నిలవవచ్చుగా!
గతం నేర్పిన పాఠాలు
అవగతం చేసుకుని
మనోగతానికి మెరుగు పెడితే
జీవితమెంతో సుఖమేగా!
చీకటి తెర తొలగించి
రేపటి వెలుగు ప్రసరించే
ఆకాశదీపమైన ఆదిత్యునికి
సంకల్ప సిద్ధి నిమ్మని కోరుతూ...
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి