చిన్ని చెల్లి - చిట్టెమ్మా:- నాగరాజు కామర్సు
చిన్ని చెల్లి చిట్టెమ్మా
చిన్నారి తల్లీ చిట్టెమ్మా

అల్లరి పనులు మానమ్మా
చెప్పిన మాట వినవమ్మా

చక్కగ తయారుకావమ్మా
చక చక బడికీ వెళ్ళమ్మా

పలకా బలపం పట్టమ్మా
అ ఆ ఇ ఈ దిద్దమ్మా

పాఠాలన్నీ నేర్వవమ్మా
పాటలు బాగా పాడమ్మా

రాతలు బాగా రాయమ్మా
చదువులు బాగా చదవమ్మా

పాఠాలన్నీ చదువుతు రాస్తూ
గురువుల మెప్పును పొందమ్మా

ఆటల పాటలతో అలరిస్తూ
అందరికీ ప్రేమను చాటమ్మా

అమ్మానాన్నల అనురాగంతో
అమితానందంగా గడపమ్మా

పెద్దల దీవెనలందుకొని
చిరకాలము జీవించమ్మా


కామెంట్‌లు