పువ్వులా నవ్వరా!దివ్వెలా వెలగరా!గువ్వలా విహరిస్తూమువ్వలా మ్రోగరా!శ్రద్ధగా చదవరా!బుద్ధిగా మసలరా!శుద్ధమైన మనసుతోవృద్ధిలోకి రా!రా!మొక్కలా ఎదగరా!చుక్కలా పొడవరా!తిక్క తిక్క పనులు మానిపక్కిలా బ్రతకరా!కన్నోళ్లను చూడరా!ఉన్న ఊరు మరువకరా!పక్కవారితో కలసిపక్కాగా ఉండరా!హద్దులను దాటకరా!మొద్దుబారి పోకురా!అద్దంలా ఉంటూనే!పెద్దరికం చూపరా!
గురువు ప్రబోధ గీ(నీ)తి :- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి