1) తేట తేట తెనుఁగు చన్నీట తానమాడి
పచ్చ పచ్చని పైరు పట్టు పుట్టంబు గట్టి
సనాతన ధర్మ సుగంధ మలది, కనకదుర్గమ్మ
నీ నుదుట కుంకుమై నిలువ, వాసికెక్కితివి
వైభవోపేత మాతెనుగుమాతా!
2)
కృష్ణ, గోదావరి, ఉత్తుంగ తుంగ
మూడు పాయల జడ వాసికెక్క.వేద, వేదాంగములనెడు
కాంచన సౌగంధికాపుష్పముల, జైన, బౌద్ధ, శైవాది కుసుమములు.నీ జడ ముడిచితివి మా కల్పవల్లి.
3 నీ నోటి మాట మాపాలి ముత్యాలమూట నీ వు పాడిన పాటది
పంచామృతమ్ము.పద్య మవధానములు తెలుగింటి లతలు
అమ్మ! చెప్పగా తరమా
నీ వేష భాషల తీరు ఓ తెలుగు మాతా.!
3) నన్నయ చేతి ఆది గంటారవమ్ము, తిక్కన
త్రావించిన తేట తెనుఁగు తేనె,
శ్రీనాధుని శృంగార రస
సరస సాహిత్య వీణ.
రాయల రచన,శ్లేష కావ్య మంజరులు.
అన్ని నీ కాలి మువ్వలేగదా!మృదు భాషిని,సుభాషిణి తెలుగు భాషామతల్లీ!
4) అందుకే
మాట్లాడితేచాలు తెలుగువారమైపోతామా? మనం పంచుకోవాల్సినది,పెంచుకోవాల్సినది మన
సాహిత్య సంపద.
5)తెలుగు,అది మల్లె,మొల్ల,జాజి,సన్నజాజి ఆన్నికలిసినంత
మధురమైన భాష.
అతి పురాతనమైనదని
రేనాటి చోళుల శాసనాల పుణ్యమై
వెలసి ,తన ఉనికిని, తెలియ చెప్పిన భాష మన తెలుగు భాష ఈ నాటి అందమైన మన కందం రేండూ వేల వత్సరాల
క్రితం పుట్టిన ఛందచ్చందనం.ప్రపంచ లిపుల సరసన మన తెలుగులిపి రెండవ స్థానం దక్కించుకొంది.
6)) చివరిమాట.
పాపలనవ్వులా,
పువ్వల బాటలా,
మువ్వల సవ్వడిలా,
గువ్వల గుస గుసలా,
సాగే తెలుగు భాష
ప్రతి ఇంటా ప్రతి చోటా
ప్రపంచమంతా అమృత వర్షంలా
కురుస్తూనే ఉంటుంది.
మనం తడుస్తూనే ఉంటాం.లేదు
దానికి అంతం.అది మనసొంతం ఒకవేళ
తెనుఁగు అంతమైతే
మనమే హంతకుల మవుతాం .
అలా కాకుండా కాపాడుకొందాం
.జై తెనుఁగు తల్లి జై తెనుఁగు భాషా.
సి వసుంధర.చెన్నై.
హామీ.
ఈనాటి తెనుఁగు భాషా(అంతర్జాతీయ)
దినోత్సవానికిగానూ
రాసిన కవిత ఇది.నాసొంత రచన.
సి వసుందర

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి