రంగులు:- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 మిత్రమా!
నీలి రంగైన గేయం 
పసుపురంగైన సంగీతం
ఆకుపచ్చని నాట్యం
ఎరుపు సౌందర్యం
శ్వేతవర్ణ ప్రేమ
గులాబిరంగు సంతోషం
ఇలా ఈ రంగులన్నీ
నిన్ను ముంచెత్తాలని 
ఈ హోళీ నీ జీవితాన్ని
రంగులమయం చేసి
రంగురంగుల సంతోషాలను
నీకు బహూకరించాలని
మరీ ముఖ్యంగా
ప్రేమ రంగుతో బాటు
మిగతారంగులన్నీ సరికొత్తగా
నీ జీవితంలో విరబూయాలని
నీ సుఖమే నే కోరుతున్నా!!
**************
మీకు హోలీ పర్వదిన శుభాకాంక్షలతో 
============================
కామెంట్‌లు