చెట్లను రక్షించాలి:- గుగులోత్ ప్రేమ్ సింగ్ -తొమ్మిదవ తరగతి - జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేలి ఘనపూర్-జిల్లా మెదక్
   అనగనగా సుల్తాన్ ఫుర్ అనే గ్రామంలో రాజు, రాము, మధు అనే ముగ్గురు సోదరులు ఉండేవారు. వాళ్లు ప్రతిరోజు అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టుకొని, పట్నం తీసుకువెళ్లి అమ్ముతూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. అలా ప్రతిరోజు వాళ్ళ ప్రయాణం సాగేది. వారి ముగ్గురిలో చిన్నవాడు మధు చెట్లు నరికినప్పుడల్లా బాధపడేవాడు. ఏమైందని అన్నలు మధును అడగగా, ఇలా మనం చెట్లు కొట్టడం మూలంగా అడవిలో పండ్లు లేక జంతువులు, కోతులు అన్ని ఊర్లోకి వస్తున్నాయి. అందువల్ల మనము చెట్లను కొట్టడం మానేయాలని మధు అన్నాడు. అన్నలు ఇద్దరు కూడా తమ్ముడు మాటలకు బాగా ఆలోచించి, అడవిలో చెట్లు కొట్టడం మానేసి, పట్నంలో కూలీ పనులు చేస్తూ జీవించసాగారు. 
              కూలి పనుల్లో బాగా ఆదాయం రావడం వలన తీరిక సమయంలో అడవిలో ముగ్గులు మొక్కలు నాటేవారు. వీరి ముగ్గురి గురించి తెలుసుకున్నాక గ్రామంలో ఎవ్వరూ కూడా అడవిలో చెట్లను నరికే వారు కాదు. అందువల్ల అడవిలో జంతువులు ఉండేవి. జనమంతా కూడా ఊర్లో సంతోషంగా ఉండేవారు. ముగ్గురు అన్నదమ్ములు చాలామందికి ఆదర్శంగా ఉంటూ అడవి గొప్పతనం అందరికీ చెప్పుసాగారు.

కామెంట్‌లు