సుప్రభాత కవిత : - బృంద
కడలి దాచిన కనక కుంభం 
పైకి తేలి ఒలికించిన 
కాంచన ధారలు ఒడిసిపట్టిన 
ఒడ్డుకు వచ్చిన అలలు..

సాగరానికి సూర్యుడు గీసిన 
లక్ష్మణరేఖలా?

గట్టు దాటితే గుట్టు ఉండదని 
హెచ్చరికలా?

సైకత  దారులను స్వర్ణమయం 
చేసే కాంతి ధారలా?

పుడమికి పుత్తడి వెలుగులు 
పరచే అనుగ్రహలా?

బంగరు కాలం వస్తోందని 
సంకేతాలా?

కలతలు కరుణతో కాల్చివేస్తానని 
ఓదార్పులా?

మంచి చెంత చెడు చేరనివ్వక 
కంచెలా కాపలాలా?

దివినుండీ  దిగివచ్చే వెలుగుల 
వేలుపు చూపులా?

చిచ్చును ప్రవహింపచేసి అయినా 
ధర్మ రక్షణ చేయమని ఆదేశాలా ?

ప్రవహించు ప్రభాకరుని 
ప్రభలకిన్ని అర్థాలా?

మార్పు కోరే మనసులకు 
తూర్పు పలికే 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు