కాప్రా మల్కాజగిరి కవుల వేదిక వనితకు వందనంగుండ్లపల్లి రాజేంద్రప్రసాద్
 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భాన కాప్రా మల్కాజగిరి కవులవేదిక ఎ ఎస్ రావునగర్ లో వనితకు వందనం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించింది. ప్రసిద్ధ కవులు కవయిత్రుల ప్రసంగాలతో ఆద్యంతం కారక్రమం చాలా బాగా జరిగింది.
పలువురు ప్రముఖ కవుల మధ్య ఆప్యాయంగా మాట్లాడుకుంటూ శుభాకాంక్షలు తెలుప్కుంటూ కార్యక్రమం విన్నూతనంగా జరిగినందుకు ముఖ్య అతిధిగా పాల్గొన్న విశ్వపుత్రిక డాక్టర్ విజయలక్స్మి పండిట్ సంతోషం వ్యక్తపరిచారు. ఎందరో స్త్రీలు పోరాడి మరియు ఎందరో పురుషుల సహకారంతో మహిళలు సాధికారత సంపాదించారన్నారు.  సభకు అధ్యక్షత వహించిన సినిమా టీవి గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ వేదిక స్థాపించిన కొద్ది నెలలలోనె మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి హృదయాలను కొల్లగొట్టిందన్నారు. ప్రముఖ సాహితీవేత్త శ్రీ దాస్యం సేనాధిపతి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించి లేడీ టీచరు అనే చక్కని కవితను చదివి వినిపించి అందరిని ఆకట్టుకున్నారు.  ప్రముఖ కవయిత్రి , రచయిత డాక్టర్ దేవులపల్లి పద్మజ మాట్లాడుతూ విశాఖపట్నం నుండి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తెలుగు వెలుగు తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నవనీత రవీందర్ మాతృభాష దినోత్సవ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తనను ఆదిలాబాద్ నుండి విశిష్ట అతిధిగా ఆహ్వానించి సన్మానంచెయ్యటం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పారు. ప్రముఖ కవి, విశ్రాంత వాణిజ్యపన్నుల అధికారి మహిళా దినోత్సవ విశిష్టతను తెలుపుతూ తను స్వయంగా పయనిస్తూ చూచిన సందర్భాన్ని అద్భుత కవితగా కూర్చిన కవితను చదివి ప్రేక్షకుల హృదయాలను తట్టారు. విశ్రాంత అటవి శాఖ అధికారి అంబటి లింగ క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ కలకంఠి కన్నీరు కార్చకూడదని, అర్ధనారీశ్వరం హిందూ ధర్మమని చక్కగా ప్రసంగించారు.
కవిసమ్మేళనంలో అయ్యల సోమయాజుల ప్రసాద్, బలుసాని వనజ, కొలచన శ్రీసుధ,  నామాల రవీంద్ర సూరి, కోకిల సుజాత, పంతుల లలిత, ఉండవల్లి సుజాతమూర్తి, డాక్టర్ నాగేశ్వర్, మంత్రిప్రగడ మార్కండేయులు, కోదాటి అరుణ, ధనమ్మారెడ్డి, పోచం సుజాత, లలిత చండి, సీనమ్మ, శోభ దేశపాండే, బుక్కపట్నం రమాదేవి మొదలగు 50 మంది కవులు పాల్గొని చక్కని కవితలను, పాటలను వినిపించారు. 
కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షురాలు రాధా కుసుమ కవిసమ్మేళనమును చక్కగా నిర్వహించి కవులను ప్రేక్షకులను అలరించారు. కవి, నంది అవార్డు గ్రహీత దీపక్ న్యాతి తొలుత అతిధులకు స్వాగతం పలికారు. అక్షర కౌముది వ్యవస్థాపకు అధ్యక్షులు తులసి వెంకట రమణాచార్యులు వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. 
సభను, కవిసమ్మేళంను, సదుపాయాలను చక్కగా ఏర్పాటుచేసినందుకు పాల్గొన్న కవులు సంతృప్తిని వ్యక్తపరిచారు.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, 
కాప్రా మల్కాజగిరి కవుల వేదిక సమన్వయకర్త

కామెంట్‌లు