అమ్మభాష
ఆంధ్రము
చిమ్ముతుంది
ప్రకాశము
అమ్మభాష
మధురము
చిందుతుంది
మరందము
అమ్మభాష
అమృతము
నిలుస్తుంది
కలకాలము
అమ్మభాష
సుమము
చల్లుతుంది
సౌరభము
అమ్మభాష
అందలము
ఆరోహణము
అవశ్యము
అమ్మభాష
మార్గదర్శకము
కనబరుస్తుంది
మంచిపధము
అమ్మభాష
పండినఫలము
పదాలు
పనసతొనలు
అమ్మభాష
పఠనీయము
ఇస్తుంది
విజ్ఞానము
అమ్మభాష
ప్రియము
పెంచుతుంది
బాంధవ్యము
అమ్మభాష
సాధనము
చేకూరుస్తుంది
సౌభాగ్యము
అమ్మభాష
భండారము
వజ్రవైఢూర్యాలకు
నిలయము
అమ్మభాష
అమరము
అమృతముతో
సమానము
అమ్మభాష
అమూల్యము
గౌరవానికి
ప్రతీకము
అమ్మభాష
అజంతము
పలుకుబడులకు
ప్రాణము
అమ్మభాష
సుజలము
చక్కెర
పానీయము
అమ్మభాష
సౌమ్యము
పదలాలిత్యానికి
ప్రఖ్యాతము
అమ్మభాష
పలుప్రక్రియలకుస్థానము
అవధానాలకు
ఆలవాలము
అమ్మభాష
ఆదర్శము
అందరికీ
అనుసరణీయము
అమ్మభాషకు
అంకితమవుదాం
అమ్మను
ఆరాధించుదాము
అమ్మకుజేజేలు
పలుకుదాము
అమ్మభాషను
వ్యాపిద్దాము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి