అందమంటే
చందమామ అంటారు!
గొప్పతనం అంటే
గగన మేఘం అంటారు!!
స్ఫూర్తి అంటే
మెరిసే నక్షత్రం అంటారు!!
గురువు అంటే
కరిగే హిమగిరి అంటారు!!
ప్రతిభ అంటే
ప్రకాశించే భానుడు అంటారు!!!
ఇవన్నీ కలిపితే
ఇంతీ పూబంతీ
చేమంతి మా చెల్లి!!
గోమాత భూమాత
మా తల్లి మా చెల్లి -శోభ!!
రజిత ఐరావతం ఆమెది !!
సువర్ణ బంగారు నంది ఆమెది!!
అక్షర లక్ష్మి- ఆమె !
లక్షల సరస్వతి -ఆమె !!
కీర్తి ఆమె -స్ఫూర్తి ఆమె
దయ ఆమె- ధనం ఆమె!!
ప్రేమ మూర్తి -ఆమె !
నిత్య విద్యార్థి- ఆమె!!
శుభం ఆమె -శోభ ఆమె!!
బంగారు నంది అవార్డు గ్రహీత
ఉత్తమ ఉపాధ్యాయిని శ్రీమతి శోభారాణి గారికి అభినందనలతో.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి