ఓ నా కవి మిత్రులారా..!
సరస్వతీ పుత్రులారా..!
సాహితీ మూర్తులారా..!
పండితోత్తములారా...!
కవి కిషోరులారా...!
కవిత్వమంటే..?
కుత్తుకలు తెంచే కత్తి..!
కవిత్వమంటే..?
పరిమళించే పూలగుత్తి..!
కవిత్వమంటే..?
వెలుగులు పంచే కొవ్వొత్తి..!
కవిత్వమంటే..?
నాలుగు లైన్లలో
నాలుగు లోకాలు
చూపించగల కృష్ణ యుక్తి..!
కవిత్వమంటే..?
ఒక మట్టి గుండెలో
ముత్యాల వెన్నెల్ని నింపగల శక్తి..!
కవిత్వమంటే..?
అక్షరాలు కదిలే దారిలో
అభిప్రాయాల ఊహల పరవశం..!
కవిత్వమంటే..?
నిర్లిప్త హృదయంలోనూ
జీవన ఝరులు ప్రవహించే మంత్రం..!
కవిత్వమంటే..?
అభాగ్యులకు ఆశాకిరణం...
అక్షరాలతో అలంకరించే ఆభరణం...
అది ఆశల అభిప్రాయాల ఆత్మార్పణం..!
కవిత్వమంటే..?
నిశ్శబ్దంలో వినిపించే
హృదయ స్పందనం...
కనిపించని భావనకు కన్నీటి సాక్ష్యం..!
కవిత్వమంటే..?
కనుపాపల్లో కదలాడే కలల చెమ్మ...
కాలంతో పోటీపడి చేసే ఆత్మగానం..!
కవిత్వమంటే..?
ఒక మాటలో మొలకెత్తే పచ్చనివృక్షం...
చెరగని వాసనై గాలిలో నిలిచే గంధం..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి