విశ్వావసు సంవత్సరమా:- కోరాడ నరసింహా రావు.
 పల్లవి :-
  విశ్వావసు సంవత్సరమా
 స్వాగతం...! 
  మా నూత్న తెలుగు వత్స రమా సుస్వాగతం...!! 
 మాచైత్రకన్య,వసంతుడును , నిను స్వాగతించు చున్నారు...! 
లే చివుళ్ళుమేసిన కోయిల కుహు కుహు గానాలతో 
 నిను స్వాగతించుచున్నది
ఓవిశ్వావసుసంవత్సరమా స్వాగతం...! 
  మా నూత్నతెలుగు వత్స రమా సుస్వాగతం...!! 
 చరణం :-
   అరవ దేండ్ల పిదప మరల వచ్చావు , 
పండ్రెండు నెలలే మాతో నీ వుంటావు...! 2
   నీ చెలిమి మాకు తీపిగురుతు కావాలి...
  నీవు మాకు మరపు రాని మంచిని కలిగించాలి ! "విశ్వావసుసంవత్సరమా"
చరణం :-
ఎన్నెన్నో ఆశలతో... 
ఎన్నో కొత్త కోర్కెలతోస్వాగ తించు చుంటిమి నిను... 
 మా ఆశలు, మా కోర్కెలు తీర్చినా-తీర్చకున్న
 ఎట్టి కష్టములనుకలిగించకుమా ఓ విశ్వావసు సంవత్సరమా.! 
వేన వేల వందనాలు మా నూత్న తెలుగు వత్సరమా
     *****

కామెంట్‌లు