గ్రామాలు, పాఠశాలల అభివృద్ధిలో ప్రజల సహకారం గొప్పదని, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (పిల్లల స్వయం అభ్యసన కేంద్రం) ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. మంగళవారం ఉదయం పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పిటిఎం) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రైవేట్ పాఠశాలలు ఉండవని, మన దేశంలో మాత్రం అవి రోజురోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయన్నారు. విద్య, వైద్యం ప్రైవేట్ పరం కావడం భవిష్యత్తు తరాలకు అంత మంచిది కాదని, తల్లిదండ్రులు ప్రైవేటు విద్యను పక్కన పెట్టి, ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (పిల్లల స్వయం అభ్యసన కేంద్రం)లో కంప్యూటర్ విద్యను ప్రారంభిస్తున్నందున తల్లిదండ్రులు తమ పిల్లలందరినీ ఊషన్నపల్లి పాఠశాలలోనే చేర్పించాలని ఈర్ల సమ్మయ్య కోరారు.
కార్యక్రమంలో హెచ్ఎం ఈర్ల సమ్మయ్య, టీచర్లు అమృత సురేష్ కుమార్, శ్రీవాణి, తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి