నిర్భయంగా నిలిస్తే...గెలుస్తాం..?:- కవి రత్న సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
నిర్భయంగా
నిలబడితే గెలుస్తాం‌‌...
పడిలేస్తే పరుగులు తీస్తాం...
అదే విశ్వవిజేతల నినాదం..!

గెలుస్తాం...
బలహీనతలను బలంగా చేసి...
కష్టాలను నెత్తిన మోసి...
ఆశను ఆయుధం చేసుకుని...
అహంకారాన్ని
ఆత్మబలంగా మార్చుకుని...
సింహంలా పోరాడితే...గెలుస్తాం...!

గౌరవిస్తాం...
కులమతాల అద్దంలో కాదు...
ప్రేమని ప్రతిబింబించే
హృదయంలో...
సహనత్వపు పరిమళాన్ని
వెదజల్లే వారికి...
సమతా మమతల గుడిలో...
పూలహారతులిస్తాం...గౌరవిస్తాం..!

కొలుస్తాం...
బెదిరించే వ్యక్తుల్ని
దుష్ట శక్తుల్ని చిత్తుచేసే...
ధైర్యాన్ని...సాహసాన్ని
వేదనలను రోదనలను...
భరించే సహనాన్ని ఇచ్చే...
భగవంతున్ని స్మరణ చేస్తాం...
భక్తిశ్రద్ధలతో నిత్యం...కొలుస్తాం...!

నిలుస్తాం...
నిస్వార్థ సేవను శిరసావహిస్తే...
లోకానికి వెలుగురేఖలా మారితే..
జీవితాన్ని జీవన సత్యంగా మలిస్తే...
ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా...
ఆత్మగౌరవపు సింహాసనంపై...
ఆత్మబంధువులా నిరంతరం నిలుస్తాం...!



కామెంట్‌లు