రాలిన ఆకుల మరువకనే
పూవుల సందడి తరువులోన
మోడుగ మారిన మనసులకు
వేడుక దొరికే తరుణమిది!
ఆమని రాకతో తోటలో
ఝమ్మని తుమ్మెద పాటలే!
రమ్మని పిలిచే పిలుపుకు
కమ్మగ పలికే కోయిలలే!
కలతల మంచున తడిసిన
మమతల మాయను మునిగిన
మనసును మురిపించగా
వేకువ తెచ్చెను కానుకలే!
పుత్తడి కాంతులు ఒలికిస్తూ
మెత్తగా వెలుగులు పంచుతూ
కొత్తగా తెచ్చిన క్షణాలను
గుత్తి గా అందింప ఏతెంచేనులే!
భువికి వచ్చిన వసంతుని చూచి
మెదిలే భావాల సందడితో
మదిలో మకరందము చిందగా
హృదియే మారెను మధువనమై!
కొత్తవెలుగులు పంచే వేకువకు
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి