మండల విద్యాశాఖాధికారులు చందక గోవింద, నిమ్మల శ్రీనివాసరావుల నిర్దేశాలతో, మండలంలో అన్ని పాఠశాలలను పర్యటించి, పాఠశాల సమగ్ర సమాచారాన్ని సంగ్రహించడం జరుగుతుందని క్లస్టర్ రీసోర్స్ మోనటరింగ్ టీచర్లు అగతముడి మోహనరావు, పెయ్యల సుజాత అన్నారు. పాతపొన్నుటూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలకు సోషల్ ఆడిట్ నిమిత్తం సందర్శించిన సందర్భంగా వారు మాట్లాడారు. ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు, ఉపాధ్యాయులు అందవరపు రాజేష్, పైసక్కి చంద్రశేఖరం, బొమ్మాళి నాగేశ్వరరావు, కుదమ తిరుమలరావులతో సమావేశమై పలు అంశాలను చర్చించారు. విద్యార్థులతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర గూర్చి చర్చించి, మరింత అవగాహన పర్చిరి. సిలబస్ లు పూర్తయినట్లు, నిర్మాణాత్మక మూల్యాంకనం పరీక్షా ఫలితాలను సంబంధిత రిజిష్టర్లలో నమోదైనట్లు సీఆర్ఎంటీలు తెలిపారు. పాఠశాల సందర్శన అనంతరం పాఠశాలను శతశాతం ధూమపాన రహిత పాఠశాలగా గుర్తించినట్లు వారు ప్రకటించారు. పాఠశాల హేబిటేషన్ పరిధిలో గల బంకి, బంకి గూడ, కొత్త పొన్నుటూరు, పాత పొన్నుటూరు అను నాలుగు గ్రామాలందు ఉన్న బడీడు పిల్లలంతా బడిలోనే ఉన్నారని, డ్రాపౌట్స్ లేరని ప్రకటించారు. అందరి పిల్లల ఆధార్ తనిఖీల ప్రక్రియ పూర్తయిందని అన్నారు. పాఠశాల పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటుట, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి సక్రమంగా నడిపిస్తున్నట్లు తెలిపారు. సిఆర్ఎంటీలు అగతముడి మోహనరావు, పెయ్యల సుజాతలు మాట్లాడుతూ పాత పొన్నుటూరు, కొత్త పొన్నుటూరు, పాతపాడు, నివగాం వన్, నివగాం త్రి ప్రాథమిక పాఠశాల లతో పాటు, నివగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను తాము సందర్శించినట్లు, సేకరించిన ఆ పాఠశాలల ప్రాథమిక సమాచారాలను విద్యాశాఖకు నివేదించనున్నట్లు తెలిపారు. అదే విధంగా మండలంలో గల మిగతా పాఠశాలలను సీఆర్ఎంటీలైన నిమ్మక రామారావు, గులుమూరు శంకరరావు, చీర సంతోషి, అల్లక హిమబిందు, నగరికటకం వెంకటరావు, పుత్రకొండ నాగభూషణ రావు, ఎం.మోహనరావు, పి.సుజాతలు సందర్శించుచున్నారు.
పాఠశాలల్లో సీఆర్ఎంటీల ప్రాథమిక సమాచార సేకరణ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి