పరిష్కారం....! :- కోరాడ నరసింహా రావు.
 తీవ్ర సామాజిక అసమానతలకు దర్పనం...ఈ ద్రుశ్యం! 
  ఆకాశ హర్మ్యాలలో అరగనంత ఉన్నవారు కొందరు... 
   కూడు, గూడు లేని నిరు పేదలు ఎందరో...!! 
ఎన్నెన్నో ప్రభుత్వ రాయి తీలు ... 
  అందుకుంటున్న దెవరో ఆ సర్వేశ్వరునికే ఎరుక... 
    లోపించిన నిజాయితీ 
 అటు పాలకుల్లోను... 
  ఇటు పాలితుల్లోనూ! 
  అవకాశమున్నా... అందరి కంటే ముందు జోలి పట్టే నికృష్టులు! 
  తెలిసీ...తెలియనట్టు అమలుజరిపే 
 ...అధికారులు !! 
    కోట్ల ప్రభుత్వఖజానాకు గండి... 
   నిజమైన లబ్దిదారుల దురద్రుష్టం...!
పోవాలి ఈ దుస్థితి... 
  మారాలి సంక్షేమ విధా నాలు... 
  రద్దు చేయాలి ఉచిత బియ్యము,ఇల్లు,డబ్బులు
 తెరవాలిప్రభుత్వగ్రుహాలు
 సమ కూర్చాలి అత్యవస రాలు...! 
  తేలిపోతారు నిజ మైన లబ్దిదారులు...!! 
  ఇదియే ఈ సమస్యకు ఖచ్చితమైన పరిస్ కారం

కామెంట్‌లు