అడవికి రాజు సింహం. ఒకరోజు ఆ సింహం అన్ని జంతువులను సమావేశపరచి ఇలా అన్నది. "నా వృద్ధాప్యం, అనారోగ్య సమస్యల వల్ల త్వరలో ఈ అడవికి కొత్త రాజును నియమించాలని అనుకున్నా. ఎవరైతే ఈ అడవికి ఎక్కువ సేవలు చేస్తారో వారినే రాజును చేస్తా." అన్నది.
సింహం ఈ ప్రకటన చేసిన తరువాత కొన్ని జంతువులు తోటి జీవుల యోగ క్షేమాలు విచారిస్తూ శాయశక్తులా సేవలు చేయడం మొదలు పెట్టాయి. అడవి అంతా ప్రతి రోజూ కలియ తిరగడం, తోటి జీవులను ఆప్యాయంగా పలకరించడం, అనారోగ్యంతో మరియు కష్టాల్లో ఉన్న జీవులకు సేవ చేయడం మొదలుపెట్టాయి. సింహం ఎప్పుడు ఎన్నికలు పెడుతుందో అని ఎదురు చూస్తూ ఉన్నాయి జంతువులు. కానీ సింహం జాడే లేదు.
కొన్ని నెలలు గడిచాయి. హఠాత్తుగా సింహం అడవిలో ప్రత్యక్షం అయ్యింది. మంత్రి అయిన ఏనుగు సింహం యోగ క్షేమాలు విచారిస్తూ ఆరోగ్యం ఎలా ఉందో అడిగింది. "నా ఆరోగ్యానికి ఏమైంది? కొన్నాళ్ళు దూర ప్రాంతాల అడవులు తిరిగి రావాలని అనిపించింది. కానీ నేను లేకపోతే ఈ అడవి అల్ల కల్లోలం అవుతుంది. అందుకే అబద్దం చెప్పి, ఈ అడవికి తోటి జంతువులతో సహాయం అందేలా చేసాను. ఆశతో ఆ జీవాలు శాయశక్తులా సేవలు చేశాయి. ఈ అడవికి ఇంకా చాలా కాలం రాజును నేనే." అన్నది సింహం. విస్తుపోయింది ఏనుగు.
సింహం ప్రకటన : సరికొండ శ్రీనివాసరాజు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి