అక్క హితోక్తులు:- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు
గొంతు తడుపును యేరు
సద్గుణమిచ్చు పేరు
శోధింపగ భువిలో
కాదు మంచిది పోరు

హాని చేయును నోరు
అదువు చేయుము నోరు
సభ్య సమాజంలో
బాగుండాలి తీరు

సాయపడేది టైరు
ఉపయోగమే పైరు
చదువు దూరమైతే
బ్రతుకే తారుమారు

వదరుబోతుల నోరు
వట్టి సంద్రపు హోరు
ప్రమాదకరము చూడ
ఎవరు అపగలేరు


కామెంట్‌లు