' ఊషన్నపల్లిలో పిల్లలకు ప్లేట్ల వితరణ'

 కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (పిల్లల స్వయం అభ్యసన కేంద్రం) లో గురువారం పాఠశాల పిల్లలకు శ్రీలక్ష్మి ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ షాపు యజమాని ముస్కె కుమారస్వామి 50 ప్లేట్లను ఏఓ నాగార్జునతో కలిసి పంపిణీ చేశారు. పిల్లలు మధ్యాహ్న భోజనం చేయడానికి ప్లేట్లు అవసరమని, ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య వారి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించినవారు పిల్లలకు ప్లేట్లు అందజేశారు. ఇంతకుముందు కుమారస్వామి పాఠశాల పిల్లలకు పరీక్ష అట్టలను అందజేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం కుమారస్వామి, ఏఓ నాగార్జునలను అభినందించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్లసమ్మయ్య మాట్లాడుతూ ఎఫ్ఎల్ఎన్ ద్వారా కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడమే కాకుండా మెరికల్లాంటి పిల్లల్ని తయారు చేస్తున్నామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలందరినీ ఊషన్నపల్లి పాఠశాలలోనే చేర్పించాలని ఈర్ల సమ్మయ్య కోరారు. కార్యక్రమంలో ఏఓ నాగార్జున, హెచ్ఎం ఈర్ల సమ్మయ్య, దాత ముస్కె కుమారస్వామి, టీచర్లు అమృత సురేష్ కుమార్, శ్రీవాణి, తల్లిదండ్రులు, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు