న్యాయములు-803
"అచేతనేష్వపి చేతన వ్యవహారో దృశ్యతే" న్యాయము
****
అచేతన అనగా నిర్జీవమైన.చేతన అనగా ఫ్రాణముతో ఉన్నది.ప్రాణి, మనుష్యుడు,ఆత్మ, మనస్సు, పరమాత్మ ,నా తెలివి, ప్రజ్ఞ. వ్యవహార అనగా తగవు, న్యాయము.దృశ్య అనగా చూడదగినది , సుందరమైనది, ప్రియము,అగపడు వస్తువు అనే అర్థాలు ఉన్నాయి.
అచేతన పదార్థముల యందును చేతన పదార్థములందు వలెనే వ్యవహారము లోకమున గన్పట్టుచున్నది.ఉదాహరణ "గోడ తగిలినది"అన్నట్లు.గోడకు మొగము తగలవలయును గానీ సాక్షాత్తు గోడవచ్చి మొగమునకు తగుల జాలదు గదా!
ఇవన్నీ మన నిత్య జీవితంలో జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని పట్టించుకోము.
అయితే ఇలా లోతుగా విశ్లేషించి చెప్పినప్పుడు మనకు మనమే చిన్నగా ఓ మొట్టికాయ వేసుకుని నవ్వుకుంటూ నిజాలు ఇజాలు తలుస్తూ సాగిపోతూ ఉంటాం.
ఇంట్లో నడుస్తూ నడుస్తూ ద్వారబంధాల గాయాలకు నొచ్చుకుంటూ అయ్యో! గడప తాకిందని విలవిల్లాడుతుంటాం.అచేతనమైన గడప మనల్నెలా తాకుతుంది.మనం కదా!వెళ్ళి దానిని తాకిందనే ఇంగితాన్ని మరణించినప్పుడు మన పెద్దవాళ్ళు ఈ న్యాయమును ఉదాహరణగా గుర్తు చేసి చెబుతుంటారు.
నడుస్తూ వుంటే తాకుడురాయి వచ్చి తగిలిందని అంటాం.అంటే అచేతనమైన రాయికి చేతనత్వాన్ని ఆపాదిస్తున్నాం అన్న మాట.
గోడ తాకి నుదురు గాయమైంది అన్నప్పుడు గోడ ఏమైనా విఠలాచార్యుని సినిమాలో వలె మాయా గోడా? కాదుగా ఇలా ఆలోచిస్తూ పోతే నిత్య జీవితంలో ఎన్నో రకాల సంఘటనలు, సందర్భాలు కళ్ళ ముందు కనపడుతాయి.
ఇవే కాదు కొంతమంది తాము వాడుకునే వస్తువులతో మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళు వంటింట్లో ఏదైనా వస్తువు,సోఫాలో టీవీ రిమోట్ లాంటివి కనబడకపోతే ఎక్కడ పోయింది? ఎక్కడ దాక్కుంది? నన్ను కావాలనే చికాకు చేస్తుందా?ఇలా ఏవేవో అనుకుంటూ వెదుకుతూ వుంటారు.
వాళ్ళను ఆ సమయంలో చూసినప్పుడు అచేతన వస్తువులతో మాట్లాడినట్లు ఉండదు. ఎవరో వ్యక్తులతో ముచ్చటిస్తున్నట్లు అనిపిస్తుంది.
ఇదండీ!అచేతనేష్వపి చేతన వ్యవహారో దృశ్యతే " న్యాయము అంటే.... ఈ సారి నుండి ఎప్పుడైనా ఇలా జరిగినప్పుడు ఈ న్యాయాన్ని గుర్తు చేసుకుంటూ తగిలిన బాధను మరిచీ పోదాం.మరి మీరేమంటారు?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి