న్యాయములు-812
అభ్యర్హితం పూర్వమ్ న్యాయము
*****
అభ్యర్హితం అనగా పూజితమైనది, ప్రధానమైనది, అభ్యర్హితం ప్రథమమ్ అని శాస్త్రజ్ఞుల మాట. పూర్వమ్ అనగా ఇంతకు ముందు అని అర్థము.
ప్రశస్తమైనది, ప్రధానమైనది ముందు ప్రవర్తించును.అనగా అగ్రస్థానము దానికే ఇవ్వబడును.
"మాతా పితరౌ (తల్లిదండ్రులు)"అనునట్లు"
"ప్రధానవాస్యైవ ప్రాధాన్యేన నిరాసే హేత్వంతర మాహ సచేతి! న కేవల మభ్యర్హితత్వాత్తస్య ప్రాధాన్యం స్మృతి మూలత్వాత్త దపీత్యాహ!!" బ్రహ్మ సూత్ర ( ఆనందగిరి) భాష్యమ్ 01-04-1928 లో చెప్పబడింది.ఇందులో అభ్యర్హితం పూర్వమ్ / ప్రథమమ్ అనేది కూలంకషంగా చెప్పబడినది.
దేనికీ ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ఏదైనా విషయము, వస్తువు లేదా వ్యక్తి మొదలైన వాటిల్లో మంచిది లేదా ప్రశంసించదగినది, గొప్పది, విశిష్టమైనది అందరికీ నచ్చేది , ముఖ్యమైనది ముందుగా చేయాలి. వారికే అగ్ర స్థానం ఇచ్చి గౌరవించాలి అని అర్థము.
ఉదాహరణకు ఏదైనా అంశం లేదా విషయానికి వస్తే అందులో మంచి అంశాన్ని, శాశ్వతమైన మానవీయ విలువలు ఉన్న విషయాన్ని తీసుకోవడం.వస్తువు విషయానికి వస్తే అవసరమైన ఉపయోగింపదగిన, మంచి వస్తువును ఎంపిక చేసుకోవడం.
ఇక వ్యక్తుల విషయానికి వస్తే ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఎవరిని పూజించాలి?అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది స్ఫురణ చేసేది,స్మరించుకునేది తల్లిదండ్రులను .కాబట్టి అందరికంటే ముందు తల్లిదండ్రులను పూజించాలి.
ప్రాధాన్యతా క్రమంలో కొన్నింటికి ముందు ఇవ్వాల్సిన అంశాలు, వస్తువులు వుంటాయి మనుషులు వుంటారు.
వీటిల్లో ఏవి క్రమం మారినా వాటిని ఉపయోగించుకోవడంలో, ఎంపిక చేసుకోవడంలో , బంధాలను నిలుపుకోవడంలో సరిగా ప్రవర్తించలేదని ఇట్టే తెలిసిపోతుంది. అనగా అభ్యర్హితం ప్రథమమ్ లేదా పూర్వమ్ అనేది వ్యక్తుల వ్యక్తిత్వాన్ని, వివేచనా జ్ఞానాన్ని తెలియజేస్తుంది.
బంధాలు అనుబంధాలకు నిలయమైన కుటుంబంలో మొదటగా ప్రేమ,నమ్మకం, అవగాహన, సహనం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం,గౌరవింఛుకోవడం వంటి అంశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.
స్నేహం విషయంలో కూడా నమ్మకమే పునాది. గౌరవాభిమానాలే అందులో ఆది."ఇనుము ఇనుముకు ఎలా పదును పెడుతుందో, వజ్రం వజ్రాన్ని ఎలా కోయగలమో ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉండాలి.ఎందరో వ్యక్తులు పరిచయం ఉండటం వేరు. వారితో సన్నిహితంగా ఉండే పరిచయం వేరు. మనసు విప్పి చెప్పుకోగల , వినగల,పంచుకోగల స్నేహంలో మొదటగా కనిపించేది ఒకరికొకరు సమయం ఇవ్వడం. సహనం ఓపిక కనబరచడం వంటివి ప్రథమంగా ఉంటాయి.
"అభ్యర్హితం పూర్వమ్ న్యాయము" ద్వారా వేటికెలా ప్రాధాన్యత క్రమం ఇవ్వాలో తెలుసుకోవడంతో పాటు ఎలా ఉండాలో అవగాహన చేసుకోగలిగాం. ఈ విషయాలను అన్నింటినీ గమనంలో పెట్టుకొని తదనుగుణంగా ప్రవర్తిస్తూ ఉండాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి