"కథాచంద్రిక"పుస్తకావిష్కరణ
  ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎన్ఎస్సీ కాలనీ, ఖమ్మం నందు బాల రచయిత్రి కొల్లిచంద్రిక రాసిన కథల సంపుటి "కథా చంద్రిక"  మంగళవారం పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది.
 ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీమువ్వ శ్రీనివాసరావు, కవి, రచయిత, విద్యావేత్త, జాషువా సాహిత్య వేదిక అధ్యక్షులు, మాట్లాడుతూ కథలంటే మన జీవితం లోంచి చూసినవి, విన్నవి, గమనించినవి, రాయడమే అన్నారు. కథలు నైతిక విలువలు నేర్పుతాయని, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాయని, బాల్యదశలోనే కథలు చదవటం కాక, రాస్తున్న చంద్రికను, అందుకు ప్రేరణ కలిగించిన బాల సాహితీవేత్త కొండ్రు బ్రహ్మం ని అభినందించారు.
 మరొక ముఖ్య అతిథి షెడ్యూల్ల్డ్ కులాల అభివృద్ధి శాఖ, డిప్యూటీ డైరెక్టర్, కస్తాల సత్యనారాయణ మాట్లాడుతూ, చిన్నారి చంద్రికను ఐదువేల రూపాయలతో సత్కరించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ హాస్టల్లో ఉంటూ ఈరోజు ఇంత మంచి పుస్తకాన్ని రచించడం పట్ల చిన్నారి చంద్రికను అభినందించారు. భవిష్యత్తులో మరింత గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. చంద్రిక రాసినా కథలు పుస్తక రూపంలోకి రావడానికి సహకరించిన, ప్రోత్సహించిన కొండ్రు బ్రహ్మం మరియు ఉపాధ్యాయ  బృందాన్ని అభినందించారు.
 ఈ కార్యక్రమంలో బాల సాహితీవేత్తలు గద్దపాటి శ్రీనివాస్, హాస్టల్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు కోటపాటి రుక్మారావు, వసతి గృహ సంక్షేమ అధికారులు ఎన్.విజయ, జి .వరలక్ష్మి, ఎం.విజయలక్ష్మి, ఉపాధ్యాయులు కన్నెగంటి వెంకటయ్య, రాచమల్ల ఉపేందర్, షఫీ, వై వి సార్, హెచ్ఎం రాజేంద్రప్రసాద్,  పుస్తక ప్రోత్సాహకులు, ప్రేరణ కలిగించిన కొండ్రు బ్రహ్మం పాల్గొన్నారు.


కామెంట్‌లు